ఏపీ సిఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. విశాఖ జిల్లా పాడేరులో ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాల, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో ఏర్పాటు చేయనున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నమూనాలను క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు సీఎం వైయస్.జగన్. గిరిజనులకు అటవీహక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
విశాఖ జిల్లా పాడేరులో వైద్య కళాశాల, వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కంప్యూటర్‌లో బటన్ నొక్కి శిలాఫలకాలు ఆవిష్కరించారు ఆయన. విజయనగరం జిల్లా కురుపాంలో ఏర్పాటు చేయనున్న గిరిజన ఇంజనీరింగ్ కళాశాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కంప్యూటర్‌లో బటన్ నొక్కి శిలాఫలకం ఆవిష్కరించారు సీఎం వైయస్.జగన్. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు ఆళ్ల నాని, పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, సీఎస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.