జగన్ దెబ్బ ఇలా ఉంటుందని ఊహించని చంద్రబాబు…?

-

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అవినీతి మీద అధికార పార్టీ దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రభుత్వం ఈ మేరకు గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్ ని ఏర్పాటు చేసింది. పది మంది సభ్యులతో కూడిన సిట్ బృందాన్ని పోలీస్ స్టేషన్ కి కూడా అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. దీనితో సిట్ ఇప్పుడు దర్యాప్తు వేగం పెంచింది. ఒక్క అమరావతి మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తం సిట్ పరిధిలోకి తెచ్చింది ప్రభుత్వం.

దీనితో టీడీపీ నేతల ఇళ్ళపై అధికారులు సోదాలు ముమ్మరం చేస్తున్నారు. ఎక్కడిక్కడ అవినీతి చేసారు అనే ఆరోపణలు ఉంటే చాలు వారి మీద సిట్ దాడులకు దిగుతుంది. తాజాగా టీడీపీ నేత ఇంట్లో పోలీసులు సోదాలు చేసారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల టీడీపీ నేత లక్ష్మీ నారాయణ కుటుంబ సభ్యులపై ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు ఉన్నాయి. వాటి మీద సిట్ దృష్టి పెట్టింది.

శుక్రవారమే సోదాలు చెయ్యాల్సి ఉండగా ఆయన ఇంటికి వెళ్ళగా ఎవరు లేరు. దీనితో శనివారం ఉదయం వెళ్ళారు అధికారులు. దాదాపు మూడు గంటల పాటు సిట్ అధికారులు సోదాలు చేసారు. ఈ సోదాల్లో ఎం దొరికింది అనేది తెలియకపోయినా కీలక ఆధారాలు మాత్రం సేకరించారని అంటున్నారు. అయితే ఈ పరిణామాన్ని తెలుగుదేశం పార్టీ ఊహించలేదు అంటున్నారు ఆ పార్టీ నేతలే.

ఇన్నాళ్ళు కీలక నేతల మీద దాడులు ఉంటాయని అనుకున్నారట టీడీపీ నేతలు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అగ్ర నేతలు, ఎంపీల మీద మాత్రమే సోదాలు ఉంటాయని భావించారు. కాని ఇప్పుడు ద్వితీయ శ్రేణి నాయకత్వం మీద దృష్టి పెట్టింది సిట్. మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు సన్నిహితంగా ఉన్న వారి మీద సిట్ అధికారులు దృష్టి పెట్టి సోదాలు చేస్తున్నారు. దీనితో ఎప్పుడు ఎం బయటపడుతుందో అనే భయం ఆ పార్టీ నేతల్లో నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news