ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ అసహనంగా ఉన్నారా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. తెలంగాణా ప్రభుత్వం గత కొంత కాలంగా పౌరసత్వ సవరణ చట్టం విషయంలో సీరియస్ గా ఉంది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం దానిని వ్యతిరేకిస్తూ తీర్మానం కూడా చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. దానికి తోడు హైదరాబాద్ లో జరుగుతున్న ఆందోళనలు కూడా హింసా రూపం దాల్చడం లేదు.
దీనిపై తెలంగాణా సమాజంలో ఏ విధమైన అనుమానాలు లేవు. కెసిఆర్ కూడా స్పష్టంగా ఉన్నారు కాబట్టి ముస్లిం లు కూడా ఆందోళనలు శాంతి యుతంగానే చేస్తూ వస్తున్నారు. అయితే కెసిఆర్ తో స్నేహం కోరుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం ఈ విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్క ప్రకటన కూడా చేయడం లేదని కెసిఆర్ ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది.
సంక్రాంతి సమయంలో కెసిఆర్ ని జగన్ కలిసారు. ఆ సమయంలో అసెంబ్లీ లో తీర్మానం చెయ్యాలని ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ఒకే మాట మీద ఉంటే ఇబ్బంది ఉండదు అని జగన్ కి సూచించారు. అయినా సరే జగన్ మాత్రం ఇప్పటి వరకు ఏ మాట చెప్పడం లేదని కెసిఆర్ భావిస్తున్నారు. దీనితో జగన్ తో స్నేహం అవసరం లేదని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. కేంద్రానికి జగన్ భయపడుతున్నప్పుడు విరుద్ద ప్రకటనలు ఎందుకు అనే ప్రశ్న కెసిఆర్ నుంచి వినపడుతుంది.
ఉంటే అటు ఉండాలి లేదా ఇటు ఉండాలి. అంతే గాని ప్రజల ముందు ఒక మాట పార్లమెంట్ లో ఒక మాట అవసరం లేదని కెసిఆర్ సూచించారట. ఇప్పటికే కెసిఆర్ తో సన్నిహితంగా ఉండే మజ్లీస్ పార్టీ అధినేత ఒవైసీ కూడా ఈ విషయంలో జగన్ పై విమర్శలు కూడా చేసారు. మరి ఈ విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే ఏపీ లో దీనిపై ఆందోళనలు జరుగుతున్నాయి.