అవినీతికి తావులేని పాలనే లక్ష్యమన్న సీఎం యోగీ

-

ఉత్తరప్రదేశ్‌లో నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నారు ముఖ్యమంత్రి ఆదిత్యనాత్‌. డ్రగ్స్‌,మత్తు మదార్ధాలకు బానిసలవుతున్న యువత చెడు మార్గాలను అవలంబిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ వ్యవహారానికి గత ప్రభుత్వాలు కూడా తోడ్పడ్డాయి. మత్తు పదార్ధాలను విపరీతంగా సరఫరా చేయడమే దీనిక కారణం. అలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని పూర్తిగా బాగు చేసిన సీఎం యోగి యువతను సన్మార్గంలో పెట్టేందుకు ముఖ్యమంత్రిగా కృషి చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటివరకు ఆరు లక్షల ఉద్యోగాలను భర్ఈత చేశారు యోగీ. తాజాగా ఆక్సిలరీ నర్సింగ్ మిడ్‌వైవ్‌లకు (ఏఎన్‌ఎం) నియామక పత్రాలను అందించారు సీఎం. ఎంపికైన ఏఎన్‌ఎంలకు అభినందనలు తెలిపిన ఆయన, ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగిందని, ఎంపికకు ఎలాంటి సిఫార్సులు స్వీకరించలేదని తెలియజేశారు.

లోక్ భవన్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ (UPSSSC) ద్వారా ఎంపికైన 7,182 మంది సహాయక నర్సింగ్ మిడ్‌వైవ్‌లకు (ANM) అపాయింట్‌మెంట్ లెటర్‌లను అందజేస్తూ యోగి మాట్లాడారు. లంచం,అవినీతి,అక్రమాలకు తావులేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని ఈ మేరకు సీఎం ప్రకటించారు. రానున్న మూడేళ్ళలో ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం ఎంపికైన ఏఎన్‌ఎంలందరూ నిజాయితీగా విధులు నిర్వర్తించాలని సూచించారు. అనూకులంగా కోర్టు తీర్పు వచ్చే వరకు ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా ప్రభుత్వంపై నమ్మకం ఉంచి నేడు ఉద్యోగాల్లోకి వెళ్తున్న ఏఎన్‌ఎంలను ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.గత ఆరు సంవత్సరాలుగా జాతీయ ఆరోగ్య సర్వే డేటా మెరుగుపడిందని చెప్పిన యోగీ,ప్రభుత్వాస్పత్రుల్లో సహజ డెలివరీలు పెరిగాయన్నారు. రక్తహీనత, ప్రసూతి మరణాలు మరియు శిశు మరణాల రేటును నియంత్రించడంలో విజయం సాధించామని,దీనికి వైద్యశాఖలోని అధికారుల కృషినని ఆయన కితాబిచ్చారు. ఇంత పెద్ద సంఖ్యలో ANMలు అపాయింట్‌మెంట్ లెటర్‌లను పొందడం అనేది “మిషన్ శక్తి” మరియు “మిషన్ రోజ్‌గార్” స్కీమ్‌ల సమర్దతను తెలియజేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news