దేశంలో అర్హతకు తగిన ఉద్యోగాలు లేక రాక లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగులుగా అవసరం కోసం వేరే వేరే టెంపరరీ ఉద్యోగాలలో చేసుకుంటున్నారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం నుండి తెలిసిన సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వ పరిధిలో… వివిధ శాఖకు మరియు వేరువేరు విభాగాలలో దాదాపుగా 2021 మార్చి నాటికి 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈ పోస్ట్ లలో అధికంగా రైల్వే శాఖలో 2,93,943 పోస్ట్ లు, రక్షణ శాఖలో 2,64,706 పోస్ట్ లు మరియు కేంద్ర హోమ్ శాఖలో 1,43,536 పోస్ట్ లు ఖాళీలు ఉన్నాయని తెలిపారు.
అయితే ఈ వివరణ అంతా కూడా ఇటీవల తెలంగాణ బి ఆర్ ఎస్ మంత్రి నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు జితేంద్ర సింగ్ లిఖిత పూర్వకంగా రిప్లై ఇచ్చారట. మరి ఈ పోస్ట్ లలో ఇప్పటి వరకు ఎన్ని భర్తీ అయ్యాయో ? ఇంకా మిగిలిన పోస్ట్ లను ఎప్పుడు భర్తీ చేస్తారో వారికే తెలియాలి.