కన్ఫ్యూజన్ పాలిటిక్స్: అసలు రహస్య మిత్రులు ఎవరు?

తెలంగాణలో రాజకీయాలు అసలు అర్ధం కావడం లేదు….ఎవరికి వారు కన్ఫ్యూజ్ చేయడానికే చూస్తున్నారు. అసలు ప్రజలకు ఏ పార్టీ ఎలా ఉందనే పాయింట్ అసలు అర్ధం కావడం లేదు. ఇప్పటివరకు తెలంగాణ ప్రజలు ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్‌ని ఆదరించారు. కానీ ఇకపై ఆదరించే పరిస్తితి కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీకి రెండు సార్లు అవకాశం ఇచ్చింది…మూడోసారి అవకాశం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా లేరనే చెప్పాలి.

congress-party-bjp-party

ఇదే సమయంలో ఈ సారి ఛాన్స్ కొట్టేయాలని కాంగ్రెస్, బీజేపీలు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తున్నాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే…ఈ ట్రైయాంగిల్ ఫైట్ వల్ల ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది…అందుకే ఎవరికి వారు…ఒక పార్టీ, మరొక పార్టీతో చీకటి ఒప్పందం కుదుర్చుకుంటున్నాయని విమర్శిస్తున్నారు. అంటే అలా చెప్పడం వల్ల…ఒక పార్టీ ఒక వైపు ఉంటే….మరో వైపు మరో రెండు పార్టీలు ఒకటే అని జనం భావించాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఏమో….కాంగ్రెస్-బీజేపీలు ఒక్కటే అంటుంది. అంటే ఆ రెండు పార్టీలు రహస్య ఒప్పందం చేసుకున్నాయని, ఈటల రాజేందర్…ఆ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్ధి అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ఏమో…టీఆర్ఎస్-బీజేపీ ఒకటే అని, బీజేపీ ఏమో….టీఆర్ఎస్-కాంగ్రెస్ ఒకటే అని మాట్లాడుతున్నాయి.

ఆఖరికి కొత్తగా పార్టీ పెట్టిన షర్మిల సైతం….కాంగ్రెస్-టీఆర్ఎస్ ఒక్కటే అని విమర్శిస్తున్నారు. అటు టీఆర్ఎస్ వాళ్లేమో…షర్మిల, బీజేపీ మనిషి అని అంటున్నారు. అంటే ఎవరికి వారు ఫుల్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అసలు ఎవరు ఎవరికి మిత్రులు…ఎవరికి శత్రువులు అనేది అర్ధం కాకుండా ఉంది. అంటే ఇలా రాజకీయంగా కన్ఫ్యూజ్ చేసి ఎవరికి వారు లబ్ది పొందాలని చూస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రజలకు క్లారిటీ వచ్చిందంటే…కావాలని కన్ఫ్యూజ్ చేసే పార్టీలకు బ్యాండ్ మోగించడం ఖాయం.