బీజేపీ నుంచి దేశాన్ని కాపాడేది కాంగ్రెస్సే అని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ అన్నారు. దేశాన్ని మతం, కులాలు, ఎమోషన్లతో విభజిస్తోంది… దేశం సమగ్రతను కాపాడటమే కాకుండా… దేశాన్ని రక్షించాలంటే అది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ వల్లే జరుగుతుందని మధుయాష్కీ అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ… ప్రియాంక గాంధీ పోరాటాన్ని అభినందిస్తూ, ప్రశంసిస్తూ తీర్మాణం చేసినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ శ్రేణులకు నిరాశ పడకూడదని సూచించారు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుందాం అని ఆయన అన్నారు.
ఎమర్జెన్సీ టైమ్ లో, అంతకుముందు కూడా కాంగ్రెస్ అనేక ఓటములను చూసిందని.. సోనియా గాంధీ రాజకీయాలకు పనికి రాదని అన్నారని.. కానీ 2004,2009లో యూపీఏను అధికారంలోకి తీసుకువచ్చారని ఆయన అన్నారు. సోనియా గాంధీ నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతుందని విమర్శించారని.. కాంగ్రెస్ శ్రేణులు నిరుత్సాహపడకూడదని.. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుందామని మధుయాష్కీ అన్నారు. త్వరలో రాహుల్ గాంధీ రాష్ట్రాల నాయకత్వాలను కలవబోతున్నారని.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులను కలుస్తారని ఆయన అన్నారు.