కన్ఫ్యూజన్‌లో క్రికెటర్ రవీంద్ర జడేజా.. ఈయన బీజేపీలో.. ఆయన తండ్రి, సోదరి ….

45

జడేజా భార్య రివాబా గత నెల 3న బీజేపీలో చేరారు. మోదీ జామ్ నగర్‌లో పర్యటించినప్పుడు ఆమె మోదీ సమక్షంలో బీజేపీలో చేరారు.

క్రికెటర్ రవీంద్ర జడేజా ఇప్పుడు కన్ఫ్యూజన్‌లో పడిపోయారు. ఆయన, ఆయన భార్య కొన్ని రోజులు క్రితమే బీజేపీలో చేరారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ.. ఇప్పుడే అసలు సమస్య మొదలైంది. ఆయన తండ్రి, సోదరి మాత్రం వేరే పార్టీలో చేరారు.

cricketer ravindra jadeja father joins in congress today
గుజరాత్‌లోని జామ్ నగర్ జిల్లా కలావడ్‌లో జరుగుతున్న కాంగ్రెస్ ర్యాలీలో జడేజా తండ్రి అనిరుద్ సిన్హా, ఆయన సోదరి నయనబా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాటిదార్ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు హార్దిక్ పటేల్ సమక్షంలో వాళ్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో జడేజా ఉన్నారట.జడేజా భార్య రివాబా గత నెల 3న బీజేపీలో చేరారు. మోదీ జామ్ నగర్‌లో పర్యటించినప్పుడు ఆమె మోదీ సమక్షంలో బీజేపీలో చేరారు. ఆ తర్వాత జడేజా కూడా బీజేపీలో చేరారు. కానీ.. తన తండ్రి, సోదరి బీజేపీలో చేరకుండా కాంగ్రెస్‌లో చేరుతారని మాత్రం వాళ్లు ఊహించలేదట. జడేజా, రివాబాకు 2016లో వివాహం జరిగింది. వారికి ఒక కూతురు ఉంది. రివాబా.. రాజ్‌కోట్‌లో ఉన్న జడేజా రెస్టారెంట్ వ్యవహారాలను చూసుకుంటుంది.