నాని ‘జెర్సీ’లో విక్టరీ వెంకటేష్ సర్ ప్రైజ్..!

నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా జెర్సీ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా నిర్మించారు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఈమధ్య రిలీజై సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఏప్రిల్ 19న రిలీజ్ అవుతున్న నాని జెర్సీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 15న జరుపనున్నారు. ఈ ఈవెంట్ లో స్పెషల్ గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ అటెండ్ అవుతున్నాడని తెలుస్తుంది.

స్వతహాగా వెంకటేష్ క్రికెట్ లవర్ ఇండియాలో ఎక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగినా లేదా ఐపిఎల్ అయితే హైదరాబాద్ లో ఏ మ్యాచ్ జరిగినా వెంకటేష్ పాల్గొంటాడు. ఇప్పుడు క్రికెట్ నేపథ్యంతో వస్తున్న నాని జెర్సీ సినిమాకు స్పెషల్ గెస్ట్ గా వెంకటేష్ వస్తున్నాడు. 36 ఏళ్ల వయసులో తనకు ఇష్టమైన క్రికెట్ లక్ష్యాన్ని ఎలా సాధించాడు అన్నది సినిమా కథ.