భట్టి విక్రమార్క్ కి ఢిల్లీ అధిష్టానం పిలుపు.. వార్నింగ్ ఇస్తారా…?

-

తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు కొత్త శ‌కం న‌డుస్తోంది. ఎందుకంటే ఎంతోమంది సీనియ‌ర్లు ఉన్నా వారంద‌రినీ కాద‌ని ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా ప్ర‌క‌టించ‌డంతో చాలామంది వ్య‌తిరేకిస్తున్నారు. ఇంకొంద‌రు డైరెక్టుగానే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఆయ‌న‌కు పెద్ద నేత‌లెవ‌రూ స‌పోర్టుగా రావ‌ట్లేదు. అయితే భ‌ట్టి విక్ర‌మార్క Bhatti Vikramark మాత్రం కాస్త సైలెంట్గా ఉంటున్నారు.

భ‌ట్టి విక్ర‌మార్క Bhatti Vikramark
భ‌ట్టి విక్ర‌మార్క Bhatti Vikramark

భ‌ట్టి విక్ర‌మార్క కూడా టీపీసీసీ చీఫ్ కోసం ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసి విఫ‌ల‌మ‌య్యారు. కాక‌పోతే చివ‌ర‌కు ఆయ‌నకు నిరాశే ద‌క్కింది. ఇక ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లి మ‌రీ కాంగ్రెస్‌కు చెప్ప‌కుండా సీఎం కేసీఆర్‌ను క‌ల‌వడం ఆయ‌న‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లకు దారి తీసింది.

ఇలాంటి టైమ్‌లోనే టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. మ‌రి భ‌ట్టి మాత్రం రేవంత్ నియామకంపై సైలెంట్‌గానే ఉంటున్నారు. క‌నీసం రేవంత్‌కు విషెస్ చెప్ప‌డం కానీ ఎలాంటి కామెంట్లు గానీ చేయ‌ట్లేదు. దీంతో ఆయ‌న్ను ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం ర‌మ్మ‌ని పిలిచింది. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లి పార్టీ లైన్ దాటినందున ఆయ‌న‌కు ఏమైనా క్లాస్ పీకుతారా లేకపోతే పార్టీని వీడొద్దంటూ ఏమైనా బుజ్జ‌గిస్తారా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news