తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన ఫైట్ జరిగే జిల్లాల్లో నిజామాబాద్ కూడా ఒకటి..2019 ఎన్నికల ముందు వరకు ఈ జిల్లాలో మరీ రసవత్తరమైన ఫైట్ ఏమి జరగలేదు…కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల నుంచి జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది…ఎప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఫైట్ కాస్త సైలెంట్ గానే జరిగేది…పార్లమెంట్ ఎన్నికల నుంచి మాత్రం ఒక్కసారిగా రాజకీయ యుద్ధం మొదలైంది. ఎప్పుడైతే నిజామాబాద్ పార్లమెంట్ బరిలో కేసీఆర్ తనయ కవిత టీఆర్ఎస్ వైపునా..సీనియర్ నేత డి. శ్రీనివాస్ తనయుడు ధర్మపురి అరవింద్ బీజేపీ తరుపున నిలబడ్డారో..అప్పుడే సీన్ మారిపోయింది.
విచిత్రం ఏంటంటే…డి. శ్రీనివాస్ టీఆర్ఎస్ లో ఉండగానే ఈ వార్ జరగడం..అయితే ఈ వార్ లో కవిత సులువుగా గెలుస్తుందని అంతా అనుకున్నారు…కానీ కేంద్రంలో మోడీ వేవ్…అరవింద్ కష్టం..ఈ రెండు కలిసి కవిత ఓటమికి కారణమయ్యాయి. ముఖ్యంగా పసుపు రైతులు కవితకు వ్యతిరేకంగా పనిచేయడం, పెద్ద ఎత్తున నామినేషన్స్ వేయడం. ఈ పరిణామాలతో ఊహించని విధంగా కవితపై అరవింద్ గెలిచారు.
ఇక ఎన్నికలైపోయి మూడేళ్లు అయిపోయాయి…అయితే ఇప్పటివరకు కవిత డైరక్ట్ గా అరవింద్ పై విమర్శలు చేయలేదు…కానీ తాజాగా మాత్రం కవిత..అరవింద్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా పసుపు బోర్డు విషయంలో అరవింద్ మోసం చేశారని ఫైర్ అయ్యారు. ఇకపై అరవింద్ టార్గెట్ గానే రాజకీయం నడుపుతామన్నట్లుగానే కవిత ప్రెస్ మీట్ నడిచింది.
ఈ విమర్శలని అరవింద్ పెద్దగా పట్టించుకోకుండా..తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు…అలాగే కవితని తనపై పోటీ చేసి గెలవాలని సెటైర్ వేస్తున్నారు. ఇలా నిజామాబాద్ లో కవిత వర్సెస్ అరవింద్ అన్నట్లు ఫైట్ జరుగుతుని…అయితే ఈ ఫైట్ నిజామాబాద్ పార్లమెంట్ విషయంలోనే కాదు..జిల్లాలోని అసెంబ్లీ స్థానాల విషయంలో కూడా…ఈ సారి నిజామాబాద్ లో బీజేపీని గెలిపించుకోవాలని అరవింద్, టీఆర్ఎస్ ని గెలిపించుకోవాలని కవిత ప్రయత్నిస్తున్నారు. మరి ఈ సారి నిజామాబాద్ లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.