సంగం డెయిరీ ఇష్యూ ఇప్పటిది కాదు.. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలోనే!

-

సంగం డెయిరీ కేసు.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ డెయిరీ చైర్మన్ ధూలిపాళ్ల నరేంద్రపై భూ బదలాయింపు పేరిట అవినీతి జరిగిందంటూ.. సీబీఐ అరెస్టు చేయడం ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టించింది. ఆయన టీడీపీ నేత కావడం, మాజీ ఎమ్మెల్యే కూడా. దీంతో వైసీపీ, టీడీపీ మధ్య మరోసారి అగ్గిరాజేసినట్టయింది. తమపై కావాలనే జగన్ ప్రతీకారం తీర్చుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సంగం డెయిరీ కేసులో ధూలిపాళ్ల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మంగళవారం ఇరువురి వాదన విన్న కోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఇక ధూలిపాళ్ల అరెస్టు అయిన వెంటనే ప్రభుత్వం సంగం డెయిరీ హక్కులను ప్రభుత్వ పరధిలోకి తీసుకొస్తూ.. దీని నిర్వహణ బాధ్యతను గుంటూరులోని పాల ఉత్పత్తి దారుల సహకార సంఘానికి అప్పగించింది. ఇక ఈ చర్యతో టీడీపీ కొత్త నినాదం ఎత్తుకుంది.

అసలు సంగం డెయిరీలో భూ బదలాయింపు ఇప్పుడు జరగలేదని, ధూళిపాళ్ల నరేంద్ర ఎండీ కాకముందే జరిగాయని ఆరోపించింది. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హాయాంలోనే దీనిపై సుప్రీంకోర్టులో విచారణ కూడా జరిగిందంటూ అసలు విషయాన్ని బటయ పెట్టింది. అప్పట్లో దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాదిస్తోంది. ఇప్పుడు నరేంద్ర హయాంలో ఎలాంటి బదలాయింపు జరగలేదని.. కావాలనే వైసీపీ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపింస్తోంది. అయితే కోర్టు తీర్పు రిజర్వులో ఉన్న టైమ్ లో ఈ వ్యాఖ్యలు కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. ఏదేమైనా ఏపీ రాజకీయాలో రోజుకో మలుపు తిరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news