టీడీపీ గెలుపు ఖాయం అని కొందరు కాదు కాదు మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే అని కొందరు వాగ్యుద్ధాలు ఖాయం చేశారు సోషల్ మీడియాలో ! బయట కన్నా ఆన్లైన్ మాధ్యమాల్లోనే ఎక్కువగా తగాదాలు జరుగుతున్నాయి. వీటిపై వాదోపవాదాలు పెరిగిపోతున్నాయి. ఏ మాటకు ఆ మాట బయట కన్నా సోషల్ మీడియాల్లో విపరీతంగా ట్రోల్స్ చేసి పాపులర్ అయ్యేది టీడీపీనే !
దీనిని కూడా ఎవ్వరూ కాదనరు. కానీ వాస్తవాలేంటి ? ఆ రోజు జరిగిందేంటి ? అవి కూడా ఆలోచిస్తే మళ్లీ జగన్ కు అధికారం వస్తుందా లేదా సీనియర్ బాబుకు మరో సారి రాజయోగం దక్కి, రానున్న కాలం రాజకీయంగా కలిసివస్తుందా ? అన్నది ఒకసారి కాదు ఒకటికి పది సార్లు ఆలోచించాలి.
తప్పిదాలు ఎలా ఉన్నా కూడా ఉమ్మడి ఆంధ్రాలో కన్నా ఇప్పుడే ఎక్కువ వివాదాలు నమోదు అవుతున్నాయి. ఇప్పుడు అంటే 2014 నుంచి.. ఇందుకు టీడీపీ మినహాయింపు కాదు ఆ మాటకు వస్తే వైసీపీ కూడా కాదు. కేవలం అమరావతి అన్న కలను సాకారం చేయాలన్న ఆలోచన తప్ప మిగిలిన వాటికి ప్రాధాన్యం ఇవ్వలేదు చంద్రబాబు. మరో విషయం ఏంటంటే ఉద్యోగుల గొంతెమ్మ కోర్కెలు తీర్చాలనుకోవడం.. ఆ విధంగా తీర్చినా వారి మన్నన లేదా మెప్పూ పొందలేకపోవడం.
గతంలో ఉద్యోగులను ఉరికించి ఉరికించి పనిచేయించిన బాబే ఈ సారి అంటే 2014 నుంచి 2019 మధ్య కాలంలో తలొగ్గి ఉండడం. ఇవే ఆయన వైఫల్యాలు. అంతేకాదు ఇదే సమయాన శాసన సభలో పదే పదే పిల్లాడయిన జగన్ అని పలు మార్లు వెక్కింరించారు పసుపు దళ సభ్యులు. కొన్ని సార్లు స్పీకర్ ఏకపక్ష ధోరణి కెమెరాలకు చిక్కి, ఆ నాటి అధికార పార్టీ స్థాయిని పూర్తిగా దిగజార్చింది. అందుకే పిల్లాడు పిల్లాడు అని పదే పదే అన్న టీడీపీకి ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నాడు జగన్ !ఇక రేపు ఎలా ఉండనుందో !
ఇక !