వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజికవర్గాల వారీగా సీఎం జగన్ పెద్ద పీట వేశారు.. బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు చెందిన నేతలకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించారు.. పార్టీకి విధేయులమని చెబుతూ..టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోకి జంప్ అయ్యేందుకు సిద్దమవుతున్నారు.. నమ్మి రాజ్యసభ ఇచ్చిన జగన్ ను.. మోపిదేవి, బీదా మస్తాన్ రావు లాంటి వాళ్లు ద్రోహం చేస్తున్నారనే టాక్ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది..
వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యుల బలముంది.. టీడీపీ, జనసేనకు బలం శూన్యం.. ఈ క్రమంలో వారిని తమ పార్టీలోకి లాక్కునేందుకు ఆ రెండు పార్టీల నేతలు ప్రయత్నాలు చేశారు..అందులో సక్సెస్ అయ్యారు కూడా.. బీదా మస్తాన్ రావు, మోపిదేవీ వెంకటరమణ లాంటి వాళ్లు పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. వారి చుట్టూ ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.. వారి వల్ల పార్టీకి ఉపయోగం లేదనే భావన వైసీపీలో వ్యక్తమవుతోంది..
మోపిదేవీ వెంకటరమణ ఎమ్మెల్యేగా ఓడిపోతే.. ఆయనకు జగన్ ఎమ్మెల్సీ ఇచ్చి.. మంత్రి పదవి ఇచ్చారు..అనంతరం రాజ్యసభకు పంపారు.. ఆయనకు జనాల్లో ప్రజాధరణ ఉంటే.. ఎమ్మెల్యేగా గెలిచేవాడు కదా అని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు.. ఆయనతో పాటు.. బీదా మస్తాన్ రావు.. గతంలో ఈయన టీడీపీలో ఉన్నారు.. అక్కడ రాజ్యసభ ఇవ్వలేదని.. విజయసాయి రెడ్డి ద్వారా వైసీపీలో చేరారు.. రాజ్యసభ సీటు సంపాదించుకున్నారు.. ఆయనకు కూడా కావలి నియోజకవర్గంలో పెద్దగా బలం లేదనే వాదన వినిపిస్తోంది.. వ్యాపారాల కోసమే ఆయన రాజకీయాలొకి వచ్చారని.. నియోజకవర్గాల్లోకి వెళ్తే వీళ్లను పట్టించుకునే వారే ఉండరని వైసీపీ నేతల నుంచి వినిపిస్తున్న టాక్.. దానికి తోడు.. వీరందరూ టీడీపీలో చేరితే ప్రజల్లో తమకు సానుభూతి వస్తుందని వారు చర్చించుకుంటున్నారు..