విపత్తులు వచ్చిన సమయంలో మీడియా తో మాట్లాడాలి అంటే ఒకటికి వంద సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ఎక్కడా కూడా విమర్శలు రాకుండా ప్రసంగించాలి. అందుకు పూర్తి సమాచారం సేకరించాల్సిన అవసరం ఉంటుంది. కాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం.. ఈ విషయంలో చాలా వెనకడుగు వేసారు. కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఇబ్బంది పెడుతుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.
అలాంటి వైరస్ విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచించి మాట్లాడాలి. కాని జగన్ మాత్రం… చాలా వివాదాస్పదంగా ప్రసంగించారు. కరోనా వైరస్ కి వాలంటీర్లు సేవ చేస్తారని చెప్పడమే కాకుండా కరోనా వైరస్ కోరియాలో పుట్టింది అని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే ఆయన ప్రత్యేక కార్యాచరణ అనేది కూడా ఏమీ ప్రకటించలేదు. ఆయనకు ఏది వస్తే అదే మీడియాతో మాట్లాడారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ప్రజలను అప్రమత్తం చేస్తూ జగన్ ప్రసంగం ఉండాలి. కాని మన రాష్ట్రం సురక్షితంగా ఉందని జగన్ చెప్పడం ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది. కరోనా వైరస్ కి డాక్టర్లు భయపడుతున్నారు. వాలంటీర్లు ఏ విధంగా సేవ చేస్తారు…? ఆయన ప్రసంగం ఆసాంతం కామెడి గా ఉందనే విమర్శలు కూడా ఉన్నాయి. కరోనా విషయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారని కాని జగన్ లో అది లేదు అనే విమర్శలు వస్తున్నాయి.
ఆయన కరోనా విషయంలో సీరియస్ గా లేరనే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. జగన్ ఎందుకో అసహనంగా కనపడుతున్నారని అనే ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని తక్కువ అంచనా వేస్తే మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు కూడా అంటున్నారు. కరోనా వైరస్ విషయంలో జగన్ ప్రసంగాలపై వైసీపీ నేతలు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి.