సంచలనం : గుడివాడలో గెలుపుపై కొడాలికి డౌట్.. కానీ..!

-

2009 వరకు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గుడివాడ నియోజకవర్గాన్ని కొడాలి నాని తన అడ్డాగా మార్చుకుని, వైసీపీకి అనుకూలమైన స్థానంగా మార్చేసిన విషయం తెలిసిందే. అక్కడ అభ్యర్ధులని మార్చిన సరే టీడీపీ..కొడాలికి చెక్ పెట్టలేకపోతుంది. అయితే అధికారంలోకి వచ్చాక కొడాలి..మరింత దూకుడుగా చంద్రబాబుని తిడుతూ వాచ్చరు. ఇంకా బాబుని అలా ఎవరు తిట్టి ఉండరు. పచ్చి బూతులు తిట్టేశారు.

ఇక ఇలా తిట్టడం, మంత్రి అయిన కూడా అనుకున్న స్థాయిలో గుడివాడని అభివృద్ధి చేయలేకపోవడం, ఇప్పుడు ఎమ్మెల్యేగా కీలక సమస్యలకు చెక్ పెట్టడంలో కొడాలి విఫలమయ్యారని టీడీపీ విమర్శిస్తుంది. పైగా ఇప్పటివరకు గెలిచినా సరే అధికారంలో లేనని కొడాలి ఓట్లు అడిగారని, ఈ సారి అధికారంలో ఉండి కూడా ఏం చేయలేదని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు.

ఇటు టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న రావి వెంకటేశ్వరరావు సైతం..ఇప్పుడు దూకుడుగా పనిచేస్తున్నారు…గుడివాడలో ప్రతి గ్రామంలోనూ పర్యటిస్తున్నారు. కార్యకర్తలకు అండగా నిలబడుతున్నారు. అలాగే ఓడిపోవడం, గత ఎన్నికల్లో సీటు దక్కకపోవడం లాంటి అంశాలు రావిపై సానుభూతి పెంచుతున్నాయి. ఇదే సమయంలో టీడీపీతో గాని జనసేన పొత్తు ఉంటే గుడివాడలో కొడాలి గెలుపు కష్టమవుతుందని ప్రచారం జరుగుతుంది.

అయితే తాజాగా కొడాలి గుడివాడలో గెలుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు, నారా లోకేష్‌లు వచ్చి పోటీ చేసినా కూడా తాను వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉంటానన్నారు. కుల సంఘాల చందా డబ్బులు వేల కోట్లు తెచ్చినా, చివరి రక్తపు బొట్టు వరకూ వైసీపీ గెలుపు కోసం పోరాడుతానని, గుడివాడలో గెలుపోటములను ప్రజలు నిర్ణయిస్తారు తప్ప, ఎన్నారైలు, పొలిటికల్ ఎనలిస్టులు కాదని, వందల కోట్ల డబ్బు తెస్తే గుడివాడ ప్రజలు అమ్ముడు పోరని, టీడీపీ మోసాలను ప్రజలు మర్చిపోలేదని కొడాలి చెప్పుకొచ్చారు. అలాగే చంద్రబాబు సీఎం కాకపోతే ప్రజలకు పోయేది ఏముందని, బతికున్నంతకాలం జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని, చంద్రబాబుకే కాదని.. టీడీపీకి సైతం ఇవే చివరి ఎన్నికలు అని అన్నారు.

అంటే ఇక్కడ కొడాలికి చెక్ పెట్టడానికి టీడీపీ ఎన్‌ఆర్‌ఐలు గట్టిగానే ఫోకస్ చేశారని తెలుస్తోంది. అందుకే కొడాలి కాస్త గెలుపుపై పూర్తి కాన్ఫిడెన్స్‌తో మాట్లాడినట్లు కనిపించలేదు. ఇక బతికున్నంత కాలం జగన్ సీఎం అని చెప్పి కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news