ఎడిట్ నోట్: కారు ‘ఓవర్‌లోడ్’..కమలం వికసించేనా!

-

తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీలో నాయకులు ఓవర్ లోడ్ అయిపోయారు. దీని వల్ల పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయిలో కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ ఆధిపత్య పోరు బాగా హైలైట్ అవ్వకుండా..గత ఏడాది కేసీఆర్..బీజేపీని టార్గెట్ చేయడం, జాతీయ పార్టీ అంటూ హడావిడి చేయడం వల్ల…అసలు పార్టీలో ఉన్న రచ్చ బయటపడలేదు. కానీ అసమ్మతి మాత్రం నివురుగప్పిన నిప్పు మాదిరిగా ఉంది. ఇది ఆ పార్టీని సైలెంట్‌గా డ్యామేజ్ చేస్తుందని చెప్పవచ్చు.

వాస్తవానికి 2014 ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్ పార్టీకి 119 స్థానాల్లో పూర్తిగా బలమైన నాయకులు లేని పరిస్తితి. కానీ ఎప్పుడైతే 2014 ఎన్నికల్లో 63 సీట్లు గెలుచుకుని బోర్డర్ లో అధికారంలోకి వచ్చిందో అప్పటినుంచి..టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎమ్మెల్సీలని, నేతలని లాగేసి..బీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా బలపడింది. 2018 ఎన్నికల్లో గెలిచాక అసలు టీడీపీని పూర్తిగా లేకుండా చేసింది..కాంగ్రెస్ పార్టీని కూడా దాదాపు అదే పనిచేసింది. అయితే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలని దెబ్బకొట్టింది గాని..దాని వల్ల పరోక్షంగా కారు పార్టీ నష్టపోయే పరిస్తితికి వచ్చింది.

ఎందుకంటే వలస నేతల వల్ల కారులో ఆధిపత్య పోరు పెరిగింది. ముందు నుంచి పార్టీలో ఉన్న నేతలు, వలస వచ్చిన నేతల మధ్య పెద్ద రచ్చ జరుగుతుంది. దాదాపు 50 నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు ఉందని పార్టీ అంతర్గత సర్వేల్లో తేలింది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి వచ్చిన 12 మంది, టీడీపీ 2, ఇండిపెండెంట్లు 2 ఎమ్మెల్యేలు వచ్చిన చోట్ల పోరు ఎక్కువ ఉంది. వారి స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయిన బీఆర్ఎస్ నేతలు సీటు కోసం గట్టిగా పోటీ పడుతున్నారు. ఉదాహరణకు కాంగ్రెస్ లో గెలిచిన పైలట్‌ రోహిత్‌రెడ్డి తర్వాత బీఆర్ఎస్ లోకి వచ్చారు. దీంతో  తాండూరులో రచ్చ ఉంది. ఆ సీటుని మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి ఆశిస్తున్నారు. ఇలా ఎక్కకడక్కడ రచ్చ జరుగుతుంది.

అయితే ఈ పోరు వల్ల కారు పార్టీకి పరోక్షంగా నష్టం జరిగేలా ఉంది. ఎందుకంటే ఒకరికి సీటు ఇస్తే..మరొకరు సహకరించే పరిస్తితి ఉండదు..దాని వల్ల ఎన్నికల్లో రిస్క్. కారు పార్టీలో రచ్చ..పరోక్షంగా బీజేపీకి కలిసొచ్చే ఛాన్స్ ఉంది. టికెట్ దక్కని వారి బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల కొంత క్యాడర్ కూడా మారుతుంది. ఇది ఆటోమేటిక్‌గా కారు పార్టీకే నష్టం.

Read more RELATED
Recommended to you

Latest news