ఢిల్లీకి వెళ్లిన ఈట‌ల‌.. బీజేపీ అగ్ర నేత‌ల‌ను క‌లిసేందుకేనా?

-

హుజూరాబాద్‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌కుండా ఉంది. ఈట‌ల వ‌ర్సెస్ టీఆర్ ఎస్ అన్న‌ట్టు రెండు వ‌ర్గాలుగా కేడ‌ర్ చీలిపోయింది. వీరిద్ద‌రి మ‌ధ్య‌నే ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయాలు న‌డిచాయి. అయితే ఇప్పుడు మ‌ధ్య‌లోకి బీజేపీ ఎంట‌ర్ అయింది. ఈట‌ల రాజేంద‌ర్ ఎప్పుడైతే బీజేపీ కీల‌క నేత‌ల‌తో చర్చ‌లు జ‌రిపారో అప్ప‌టి నుంచి ఆయ‌న బీజేపీలో చేర‌తార‌ని క్లారిటీ వ‌చ్చేసింది.

అయితే ఆయ‌న ఎప్పుడు చేర‌తార‌నేది ఇంకా స‌స్పెన్స్‌గానే ఉంది. అయితే దీనిపై ర‌ఘునంద‌న్ రావు ఒక ఇంటిమేష‌న్ ఇచ్చారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం. ఆరోజు రాష్ట్ర రాజ‌కీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయ‌ని ఆయ‌న తెలిపారు. అంటే ఈట‌ల బీజేపీలో చేర‌తార‌ని ఇన్ డైరెక్టుగా చెప‌పారు.

ఇప్పుడు దీనికి ఊత‌మిస్తూ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లారు. మ‌రో రెండు, మూడు రోజుల్లో ఆయ‌న బీజేపీలో చేరతారంటూ వ‌స్తున్న ప్రచారానికి.. ఇవాళ ఆయన ఢిల్లీకి వెళ్లడం మరింత ఊతమిస్తోంది. అయితే ఆయ‌న వెంటే బీజేపీ అగ్ర నేత‌లెవ‌రూ వెల్ల‌లేదు. ఈటల రాజేందర్ వెంట ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ నేత వివేక్ వెంక‌ట‌స్వామి మాత్ర‌మే ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలతో చ‌ర్చ‌లు జరిపేందుకు వెళ్లారంటూ జోరుగా చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news