హైదరాబాద్ చేరుకున్న ఈటల.. రేపు రాజీనామా?

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల ఎపిసోడ్ అందిరికీ తెలిసిందే. తాజాగా ఆయన ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలను కలిశారు. గురువారం ఉదయం (కొద్దిసేపటిక్రితం) హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడతారట. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్ వచ్చే వారం మరోసారి ఢిల్లీ వెళతారట. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారట.

మొత్తంగా.. ఈ వారం రోజులుగా మాజీ ఎంపీ వివేక్ వెంక‌ట‌స్వామి, ఇత‌ర నేత‌లు చేసిన ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లమయ్యాయట. ఇక‌, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన త‌ర్వాత జరిగే పరిణామాలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు వ్యూహ రచనలు చేస్తున్నారట. రాజీనామాతో వ‌చ్చే ఉప ఎన్నికలో ఈటల రాజేంద‌ర్‌ విజయమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర నేత‌లు వ్యూహాలు రచిస్తున్నారట