మిని ఇండియా ఈటెల‌దే…మ‌ల్కాజ్‌గిరిలో క‌మ‌ల‌వికాసం

-

తెలంగాణ రాష్ట్రంలో మిని ఇండియాగా పేరున్న మ‌ల్కాజ్‌గిరి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ఈటెల రాజేంద‌ర్ విజ‌యం సాధించారు.భార‌తీయ జ‌న‌తాపార్టీ త‌ర‌పున బ‌రిలోకి దిగిన ఆయ‌న విజ‌య‌ఢంకా మోగించారు.దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గంగా కొనసాగుతున్న మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో గెలుపు ప్రతి పార్టీకి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన పార్టీకి రాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుందని.. అటు రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. అందుకే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు మల్కాజ్గిరిలో గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి.కానీ ఈసారి ఇక్క‌డ విజ‌యం రాజేంద్రుడిని వ‌రించింది.

మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేయ‌డ‌మంటే మాట‌లు కాదు.ఇక్క‌డ ఉత్త‌రాది రాష్ట్రాల నుంచి వ‌చ్చి సెటిల్ అయిన వారే ఎక్కువ‌.వారిని ఇంప్రెస్ చేయ‌డ‌మంటే పెద్ద టాస్క్‌.ఈసారి కూడా మ‌ల్కాజ్‌గిరి సెగ్మెంట్‌లో మునుపెన్నడూ లేని విధంగా తీవ్రస్థాయిలో పోటీ నెలకొంది.భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేశారు. ఇక బిఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి పోటీలోకి దిగారు.తెలంగాణ‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మల్కాజ్గిరి సిట్టింగ్ స్థానం కావడంతో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి ఎంపీగా ఉండడంతో ఇక అధికార కాంగ్రెస్‌ పార్టీ మల్కాజ్గిరి లో విజయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది.కానీ అవేమీ ఫ‌లించ‌క‌పోవ‌డంతో హ‌స్తం పార్టీ చ‌తికిల‌బ‌డింది.

మ‌ల్కాజ్‌గిరి సెగ్మెంట్ ప‌రిధిలోని ప్ర‌జ‌ల‌ గుండెల్లో ఈటెల రాజేందర్ కు మంచి పేరుంది.దీంతో విజ‌యం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలయ‌త్నంగానే మారిపోయాయి. ఎందుకంటే మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోకి తక్కువ సమయంలోనే ఓటర్ల మనసులో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు ఈటెల రాజేంద‌ర్‌.ప్ర‌త్యేకంగా మ‌ల్కాజ్‌గిరి కోస‌మే ప్ర‌త్యేక మేనిఫెస్టో రూపొదించార‌య‌న‌.ఇదే ఆయ‌న‌కు క్రేజ్ తీసుకువ‌చ్చింది.మాస్ లీడర్ గా ఉన్న ఈటెల చెప్పింది చేస్తారనే పేరుంది. కేంద్రంలో ఎలాగో బిజెపి అధికారంలోకి వస్తుంది కాబట్టి ఈటెలకే పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు అక్క‌డి ఓట‌ర్లు. దీంతో మొద‌టి రౌండ్ నుంచే ఈటెల స్ప‌ష్ట‌మైన ఆధిక్యాన్ని క‌న‌బ‌రుస్తూ వ‌చ్చారు.కౌంటింగ్ ముగిసే స‌మ‌యానికి ఈటెల రాజేంద‌ర్‌కు 3.5 లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో మల్కాజ్గిరిలో ఘనవిజయాన్ని అందుకున్నారు. ఇక్కడ రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి మూడో స్థానంలో టిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నిలిచారు. ఓట‌ర్ల న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటాన‌ని గెలిచిన అనంత‌రం ఈటెల రాజేంద‌ర్ వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Latest news