మంగళగిరిలో నారా లోకేష్ చరిత్రను తిరగరాశారు.39 ఏళ్ల ఘనమైన చరిత్రలో మొదటిసారి మంగళగిరిలో టీడీపీ విజయం సాధించింది.మంగళగిరి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తెలుగుదేశం విజయం సాధించింది.లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో చేసిన పలు కార్యక్రమాలు ఆయనకు బ్రహ్మరథం పట్టేలా చేశాయి.మంగళగిరి నియోజకవర్గంలో తరచూ పర్యటించిన నారా లోకేష్ అక్కడి ప్రజల సమస్యల పరిష్కారానికి చేయవలసిన దాన్ని కూడా అర్థం చేసుకొని అధికారంలో లేనప్పటికీ తదనుగుణంగా అడుగులు వేశారు.ఈ పరిణామమే ఆయనను ఇప్పుడు తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టేలా చేసింది.2024 ఎన్నికల్లో ఆయన బంపనర్ మెజారిటీతో గెలుపొందారు.
ఏపీలో హాట్ సీట్ గా భావించిన మరొక స్థానం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం.మంగళగిరి నియోజకవర్గం లో లోకేష్ ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలైన లోకేష్, నాటి ఓటమి తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేకమార్లు అవమానాలను ఎదుర్కొన్నారు. ఈ సారి గెలవాలనే పట్టుదలతో తొలి నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేసారు.నియోజకవర్గంలో ప్రతీ గ్రామంతో మమేకం అయ్యారు. తాను ఓడిన చోటే గెలిచి అసెంబ్లీకి వస్తానని మంగళగిరిలో గెలిచి తన తండ్రి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇస్తానని గతంలో చెప్పారు లోకేష్.అందుకు అనగుణంగానే నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారాయన.అన్నివిధాలుగా అందివచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకుని ఇప్పుడు తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
మంగళగిరిలో నారా లోకేష్ కు ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టారు. మంగళగిరి నియోజకవర్గంలో రాజధాని అమరావతి ప్రాంతం ఉండడం, ఇక్కడి ప్రజలు పెద్ద ఎత్తున జగన్ మూడు రాజధానులు నిర్ణయాన్ని వ్యతిరేకించడం కూడా నారా లోకేష్ విజయానికి కారణంగా చెప్పొచ్చు. నారా లోకేష్ గత ఐదేళ్లుగా సిన్సియర్ గా నియోజకవర్గం కోసం చేసినటువంటి కృషి ఎన్నికల ఫలితాలలో స్పష్టంగా కనిపించింది.ఇక ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలి అన్న చందంగా మంగళగిరి నియోజకవర్గం పై ఫుల్ ఫోకస్ చేసిన నారా లోకేష్ ఇప్పుడు మంగళగిరిలో విజయం సాధించారు. మంగళగిరిలో తన సమీప ప్రత్యర్థి అయిన కాండ్రు లావణ్య పై లోకేష్ గెలుపొందారు. మంగళగిరిలో నారా లోకేష్ 36వేల ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. దీంతో టిడిపి శ్రేణులు మంగళగిరి నియోజకవర్గంలో సంబరాలు జరుపుకుంటున్నారు.