ఆ మాజీ మంత్రి ఏమయ్యారు….బీఆర్ఎస్ కి దూరమైనట్టేనా..?

-

బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఆయన చేసిన హడావుడి అంత ఇంతా కాదు. బీజేపీ,కాంగ్రెస్ నేతల విమర్శలపై ఎప్పటికప్పుడు కౌంటర్ అటాక్ ఇచ్చేవారు. జిల్లా అంతటా తానే అన్నీ చక్కబెట్టేవారు. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడా కనిపించడం లేదు . బీఆర్ఎస్ నిర్వహించే ఏ కార్యక్రమానికి ఆయన హాజరు కావడం లేదు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంపింగులు పెరిగిన నేపథ్యంలో ఆయన కూడా దారి చూసుకుంటున్నారా అనే అనుమానాలు తలేత్తుతున్నాయి. ఆయన మరెవరో కాదు మాజీమంత్రి గంగుల కమలాకర్. ఇప్పుడు ఆయన కూడా పార్టీ మారనున్నారనే టాక్ నడుస్తోంది.

ఉమ్మడి ‌కరీంనగర్ జిల్లాలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ బలమైన నేత. బీసీ వర్గాల్లో మంచి పట్టున్న నేత. ఇప్పటి వరకూ ఓటమి చెందకుండా వరుసగా విజయం సాధిస్తున్నారు. అంతే కాకుండా బీఅర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ‌కేటీఅర్‎కు అత్యంత సన్నిహితుడు కూడా. ఈ పదేళ్ళలలో ప్రభుత్వంలో, పార్టీలో అన్నీ తానై నడిపించారు. 2009లో‌ టిడిపి నుంచి విజయం సాధించిన తరువాత 2014 ఎన్నికల కంటే ముందు బీఅర్ఎస్‎లో చేరారు.

2014, 2018, 2023‎లో మొత్తం నాలుగుసార్లు కరీంనగర్ నుండి విజయం సాధించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలో బీఅర్ఎస్ ఓడిన తరువాత కమలాకర్ సైలెంట్ అయ్యారు. పూర్తిగా హడవుడి‌ తగ్గించారు. పార్లమెంటు ‌ఎన్నికల్లో కుడా అంత దూకుడు‌ ప్రదర్శించలేదు. నియోజకవర్గంలో చేపట్టిన ఏ కార్యక్రమాల్లో పాల్గోనడం లేదు. ఒకవేళ కరీంనగగర్‎లో‌ ఉన్నప్పటికీ ఇంటికే పరిమితం అవుతున్నారు. ఎప్పుడూ ‌మీడియాలో యాక్టివ్‎గా కనబడే కమలాకర్ ఇప్పుడు ‌మీడియాకి‌ సైతం దూరంగా ఉంటున్నారు.

బిఅర్ఎస్‎లో‌ ఉన్నప్పటికీ పార్టీ నేతలతో చురుగ్గా‌ కలిసి ఏ విషయమూ చర్చించడం లేదు. అయితే కమలాకర్ మనసులో‌ ఎముందో ఎవరికి అర్థం కావటం లేదు. సీఎం రేవంత్ రెడ్డి.. కమలాకర్ గతంలో‌ టిడిపిలో‌ కలిసి పనిచేశారు. వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది. ప్రభుత్వం ‌పైన‌ కూడా ఎలాంటి విమర్శలు చేయడం లేదు ఎమ్మెల్యే కమలాకర్. ఎప్పుడూ దూకుడుగా ఉండే కమలాకర్ ఇప్పుడు ‌మౌనానికి‌ అధిక ప్రాధాన్యత ‌ఇస్తున్నారు. పార్టీ మార్పు పైనా ఇప్పటికే తన అనుచరులకి సంకేతాలు ఇచ్చారని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాను‌ పార్టీలోనే ఉంటానని, బిఅర్ఎస్‎ను వీడే ప్రసక్తే లేదని‌ స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ‌ఇప్పటికే కరీంనగర్ జిల్లాలోని కొందరు బీఅర్ఎస్ ‌కార్పోరేటర్లు ముఖ్య నేతలు కాంగ్రెస్ ‌కండువా కప్పుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ ని వీడతారా… ఒకవేళ వీడితే ఏ పార్టీలోకి వెళతారు అనేది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news