వానాకాలంలో పండించిన ప్రతీ గింజను కొంటాం – మంత్రి గంగుల కమలాకర్

-

వానాకాలంలో పండించిన ప్రతీ గింజను కొంటామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని అన్నారు. కేంద్రం ధాన్యాన్ని కొనేలా సీఎం కేసీఆర్ ఒత్తడి తెచ్చారని తెలిపారు. వానాకాలం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6540 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు 1762 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు.

అధికారులు కేటాయించిన తేదీల్లో రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. యాసంగిలో సాగయ్యే ప్రతీ పంటను కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ ధాన్యాన్ని కొనేలా కేంద్రంపై ఒత్తడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతుబంధు, 24 గంటల విద్యుత్, కాళేశ్వరం జలాలతో రాష్ట్రంలో వరిసాగు పెరిగిందని గంగల కమలాకర్ అన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరిందన్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news