మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు దెబ్బకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీలో ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే గంటా శ్రీనివాసరావు కారణంగా గత కొన్ని రోజులుగా ఇబ్బంది పెడుతున్నారు. అయితే గంటా శ్రీనివాసరావు విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కాస్త సీరియస్ గానే ముందుకు వెళ్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కొంతమందిని కలుపుకొని వెళ్లే విషయంలో ఆయన తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని వార్తలు మీడియా వర్గాల్లో హల్చల్ చేస్తున్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి కొంతమంది వైసిపి ఎమ్మెల్యేలతో కూడా ఆయన మాట్లాడే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
తనతో సన్నిహితంగా ఉండే కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలహో ఆయన మాట్లాడే రాజీనామాలు చేయాలని కోరే అవకాశాలు ఉన్నాయని సమాచారం. పదేపదే రాజీనామా చివరి అస్త్రం అంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. మంత్రులు రాజీనామాలు పరిష్కారం కాదు అని చెప్తున్న తరుణంలో గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేల విషయంలో ఆయన సీరియస్ గా వ్యవహరిస్తున్నారని సమాచారం. రాజీనామా చేయాలని ఆయన కోరే అవకాశం ఉందని ఒకవేళ వాళ్ళు రాజీనామా చేయకపోతే మీడియా సమావేశం ఏర్పాటు చేసి వాళ్లని ఎండగట్టాలని ఆయన ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.