జగన్ నిర్ణయానికి టీడీపీ సీనియర్ నేతల మద్దతు… షాక్ లో చంద్రబాబు..!

-

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని విషయంలో… మంగళవారం శాశన సభలో ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ విషయంలో విపక్ష తెలుగుదేశం పార్టీ తర్జన భర్జన పడుతుంది. ఆ పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు నేతలు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటే మరికొందరు నేతలు సమర్ధిస్తూ ప్రకటనలు చేస్తున్నారు. గల్లా జయదేవ్, కేసినేని నాని, బొండా ఉమా ఇప్పటికే జగన్ నిర్ణయంపై తీవ్ర విమర్శలు చేసారు.

నివేదిక రాకుండా ఏ విధంగా ప్రకటిస్తారని ప్రశ్నించారు. అయితే విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాత్రం దీనిపై కీలక ప్రకటన చేసారు. ట్విట్టర్ లో ఆయన దీనిపై స్పందించారు… విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. సహజ సిద్దమైన సముద్ర తీర నగరం విశాఖను పరిపాలనా రాజధాని చేయడం మంచి నిర్ణయమని కొనియాడారు.

రోడ్డు, రైలు, ఎయిర్, వాటర్ కనెక్టివిటీతో రాజధాని అందరి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే నగరంగా విశాఖ మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. కాస్మో మెట్రో నగరం పరిపాలనా కేంద్రంగా కూడా మారితే విశ్వ నగరంగా ప్రసిద్ది చెందడం ఖాయమని… అందుకు విశాఖ ప్రజలు తమ సహకారాన్ని అందించడానికి సిద్దంగా ఉన్నారు అంటూ గంటా కీలక ప్రకటన చేసారు. కొంత కాలంగా పార్టీ మారతారని గంటా మీద రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఆయన జగన్ నిర్ణయాన్ని సమర్ధించడం ఆసక్తికరంగా మారింది. గంటా ప్రకటనపై తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు విస్మయం వ్యక్తం చేసారు. మరో సీనియర్ నేత కేయీ కృష్ణమూర్తి కూడా దీనిపై స్పందించారు, కర్నూలులో హైకోర్ట్ ఏర్పాటుని స్వాగతిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news