గొప్ప స‌ల‌హా ఇచ్చాడ్రా పీకే .. సోనియా రాత  మొద‌టి అధ్యాయం

-

మామూలుగానే స‌లహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాడు ప్ర‌శాంత్ కిశోర్. కానీ స‌ల‌హాల‌కు ఛార్జ్ వ‌సూలు చేసి త‌గినంత‌గా త‌నని తాను, త‌న‌వాళ్ల‌ను తాను మార్కెట్లో నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నం ఒక‌టి  చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇదే కోవ‌లో ప్ర‌శాంత్ కిశోర్ ఉంటూనే, కాంగ్రెస్ అధినాయ‌క‌త్వానికి స‌ల‌హాలూ మ‌రియు సూచ‌న‌లు ఇవ్వ‌నున్నాడు. త‌న స‌ల‌హాలూ మ‌రియు సూచ‌న‌ల అమ‌లుకు సంబంధించి ప‌క్కా ప్ర‌ణాళిక కూడా సిద్ధం చేశాడు. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లోనే కాంగ్రెస్ గూటికి చేరునున్నాడు పీకే. అటుపై  ఆ పార్టీలో కీల‌క మార్పులు అయితే రానున్నాయి అని కూడా చెబుతున్నాడు. ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యేక క‌థ‌నం మ‌న లోకం పాఠ‌కుల కోసం..

ఎప్ప‌టి నుంచో తెలుగు రాష్ట్రాల‌లో ఎదిగేందుకు రాజ‌కీయం చేసేందుకు పాపం కాంగ్రెస్ తాప‌త్ర‌య‌ప‌డుతోంది. ఇంకా చెప్పాలంటే ఆపసోపాలు ప‌డుతోంది. కొత్త గా వ‌చ్చిన ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలు దేశ రాజ‌ధానిలో దూసుకుపోతుంటే, ఇదే సమ‌యంలో  త‌మ నుంచి వెళ్లిపోయి పార్టీలు పెట్టుకున్న వారంతా స్థిర‌ప‌డిపోతుంటే, ఇంకా చెప్పాలంటే జ‌గ‌న్ లాంటి వారు స్థిర‌ప‌డిపోతుంటే, కాంగ్రెస్ మాత్రం దిక్కులు చూస్తూ చుక్క‌లు లెక్క‌పెడుతోంది. అందుకే ఈ సారి వ్యూహం మార్చాల‌ని భావిస్తోంది. పార్టీని ఎప్ప‌టి నుంచో గాంధీయేత‌ర కుటుంబంకు చెందిన వ్య‌క్తుల చేతిలో పెట్టాల‌ని భావిస్తోంది.

ఇక పార్టీని గాంధీయేత‌ర నాయ‌కుల చేతిలో పెట్టినా కూడా అధికారం మాత్రం సోనియాదే క‌దా ! క‌నుక ఆపాటి ఆలోచ‌న చేయ‌కుండా పీకే ఎలా ఉంటాడు అందుకే స్థానికంగా కాంగ్రెస్ నిల‌దొక్కుకోవాలంటే అంటే గ్రామీణ వాతావ‌ర‌ణంను అర్థం చేసుకుని , ఒకప్ప‌టిలా దూసుకునిపోవాలంటే అప్ప‌టికే అక్క‌డ స్థిర‌ప‌డిపోయిన ప్రాంతీయ పార్టీల‌ను క‌లుపుకుని పోవాల‌ని సూచిస్తున్నాడు. ఆ విధంగా జ‌గ‌న్ తోనూ ఆ విధంగా స్టాలిన్ తోనూ ఆ విధంగా మమ‌తతోనూ ఆ విధంగా నితీశ్ తోనో , లాలూతోనో లేదా ఇంకెవ్వ‌రితోనో క‌లిసి బండి లాగించేద్దాం అని అనుకుంటున్నారు. తెలంగాణ‌లో అయితే కేసీఆర్ తోనో, మ‌హారాష్ట్రలో అయితే శ‌ర‌ద్ ప‌వార్ తోనో, ఝార్ఖండ్ లో అయితే జేఎంఎంతోనో క‌లిసి పోవాల‌ని సూచిస్తున్నారు. కానీ ఇవేవీ జ‌ర‌గ‌వు. .ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఇప్పుడిప్పుడే నిల‌దొక్కుకుంటున్న త‌రుణాన అవి త‌మ అస్తిత్వంను నిలుపుకుంటాయే  త‌ప్ప జాతీయ పార్టీల‌కు అనుబంధంగా ప‌నిచేయాల‌ని అనుకోవు. క‌నుక పీకే చెప్పిన విధంగా పొత్తులు అన్ని చోట్లా కుద‌ర‌ని ప‌ని కానీ కొన్నింట మాత్రం కుదిరితే ఆ గొప్ప‌ద‌నం కూడా పీకేదే కావొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news