ఏపీ రాజకీయాల్లో పవన్ దూకుడు పెంచారు..ఇప్పటివరకు సినిమాలు ఓ వైపు, రాజకీయాలు మరో వైపు నడిపించుకుంటూ వచ్చిన పవన్…దసరా నుంచి ఫుల్ గా రాజకీయాలపైనే దృష్టి పెట్టనున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. దసరా నుంచి ఆయన మరింత దూకుడుగా రాజకీయం చేయనున్నారు.
ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారు…అలాగే మరో వైపు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అయితే దసరా నుంచి మరింత దూకుడుగా రాజకీయం చేయడానికి సిద్ధమవుతున్నారు…అక్కడ నుంచి ఎన్నికలే లక్ష్యంగా పనిచేయనున్నారు. ఇదే క్రమంలో ప్రజలకు పలు ఎన్నికల హామీలు సైతం ఇచ్చేందుకు పవన్ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే పలు హామీలకు సమబంధించి లిస్ట్ కూడా రెడీ అయిందని తెలుస్తోంది. అంటే ఎన్నికల యుద్ధానికి పవన్ సిద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో పార్టీ బలోపేతంపై పవన్ గట్టిగానే ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు పార్టీలోకి పెద్దగా వలసలు జరగలేదు. ఏదో 2019 ఎన్నికల ముందు కొందరు జనసేనలో చేరారు..ఆ తర్వాత మళ్ళీ కొందరు నేతలు జనసేన వదిలేసి వెళ్ళిపోయారు. ఇక ఇప్పటివరకు జనసేనలోకి ఇతర పార్టీల నేతలు రాలేదు.
ఇక దసరా నుంచి వలసలు కూడా ప్రోత్సహించే పనిలో పవన్ ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఉన్న వైసీపీ, టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు జనసేనలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో పొత్తు బట్టి కొందరు టీడీపీ నేతలు జనసేనలోకి వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది.
ఎందుకంటే నెక్స్ట్ పొత్తు ఉంటే కొన్ని సీట్లు జనసేనకు టీడీపీ కేటాయించాలి..ఇక ఆ సీట్లలో ఉండే టీడీపీ నేతలకు పోటీ చేసే ఛాన్స్ ఉండదు…ఈ క్రమంలోనే ముందుగానే జనసేనలో చేరితే సీటు దక్కించుకోవచ్చని కొందరు తమ్ముళ్ళు భావిస్తున్నారట. సమయం చూస్కుని బాబుకు హ్యాండ్ ఇచ్చి పవన్ చెంతకు చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.