హరీష్ ఏంది ఈ పాలిటిక్స్…జనాలు బొమ్మ చూపిస్తారు…

-

ఈ మధ్య మంత్రి హరీష్ రావు రాజకీయాలు మరీ కింది స్థాయికి వెళ్లిపోతున్నట్లు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు హరీష్ అంటే ట్రబులు షూటర్‌గా మంచి పేరు ఉండేది. అంటే పార్టీలో ఎక్కడా సమస్య ఉన్నా సరే, ఆ సమస్యని హరీష్ పరిష్కరించేవారు. అలాగే ఎన్నికల సమయంలో కూడా పార్టీ గెలుపు అద్భుత వ్యూహాలు వేసి, పార్టీని గెలిపించేవారు.

harishrao
harishrao

అందుకే కే‌సి‌ఆర్ సైతం, హరీష్‌కే ఎక్కువ బాధ్యతలు అప్పగిస్తారు. ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నికలో టి‌ఆర్‌ఎస్ గెలుపు బాధ్యతని కూడా హరీష్ తీసుకున్నారు. అక్కడ టి‌ఆర్‌ఎస్ గెలుపు కోసం హరీష్ తన వ్యూహాలకు పదునుపెట్టారు. కాకపోతే ఒకప్పుడు హరీష్ వ్యూహాలు అంటే ప్రత్యర్ధులకు అర్ధం కాకుండా, వారికి చెక్ పడేలా ఉండేవి. కానీ ఇప్పుడు హరీష్ వ్యూహాలు రివర్స్ అయ్యి టి‌ఆర్‌ఎస్‌కే చెక్ పడేలా కనిపిస్తోంది. దుబ్బాక ఉపఎన్నిక దీనికి ఉదాహరణ.

ఇప్పుడు హుజూరాబాద్‌లో అన్నీ రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. హుజూరాబాద్‌లో గెలవడానికి టి‌ఆర్‌ఎస్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఎన్ని చేసినా అది ఈటల రాజేందర్ రాజీనామా వల్లే జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు. కానీ ఎలాగైనా ఈటలకు చెక్ పెట్టడానికి హరీష్ తెగ కష్టపడుతున్నారు.

ఈ క్రమంలోనే కులాల కుంపట్లని తెరపైకి తెస్తున్నారు. ఇప్పటికే దళిత బంధు ద్వారా దళితులని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే బి‌సి కులాలని ఆకట్టుకోవడానికి పలు కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా రెడ్లని కూడా తమవైపుకు తిప్పుకునేందుకు హుజూరాబాద్‌లో సరికొత్త రాజకీయం స్టార్ట్ చేశారు. హుజూరాబాద్‌లో రెడ్డి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. త్వరలో రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

తాజాగా రజకలతో సభ పెట్టారు. రాబోయే రోజుల్లో ర‌జ‌కుల‌కు కార్పొరేష‌న్ లోన్లు ఇస్తామ‌ని చెప్పారు. అంటే కేవలం హుజూరాబాద్ ఉపఎన్నికని దృష్టిలో పెట్టుకుని కులాల వారీగా రాజకీయం చేస్తున్నారు. ఈ విషయం ప్రజలకు క్లియర్‌గా అర్ధమవుతుంది. అంటే హరీష్ ఎంత ఎక్కువ కులాల వారీగా రాజకీయం చేస్తే అంత ఎక్కువగా టి‌ఆర్‌ఎస్‌కి జనం బొమ్మ చూపించేలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news