బ్రేకింగ్: ఏపీ హైకోర్ట్ లో సర్కార్ కి షాక్

రాజధాని తరలింపుపై హైకోర్టు జారీ చేసిన స్టేటస్ కో ఆదేశాలు అక్టోబర్ 5 వరకు పెంచుతూ హైకోర్ట్ నిర్ణయం తీసుకుంది. రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది. విశాఖలో నూతన గెస్ట్ హౌస్ నిర్మాణం కోర్టు ధిక్కరణ కాబట్టి దీనిపై సీఎస్ సంతకంతో కౌంటర్ ఇంకా దాఖలు చేయకపోవటంపై ప్రశ్నించింది హైకోర్టు. వారం రోజులు కౌంటర్ దాఖలు చేయటానికి సమయం కోరింది రాష్ట్ర ప్రభుత్వం.

ఈ సందర్భంగా ఏపీ హైకోర్ట్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ… విశాఖ గెస్ట్ హౌస్ నిర్మాణం కోర్టు ధిక్కరణగా పిటిషన్ వేశామని అన్నారు. దీనిపై కౌంటర్ దాఖలుకు వారం సమయం ప్రభుత్వం కోరింది అని చెప్పారు. అంశాల వారీగా పిటిషన్లు విచారించాలని నిర్ణయం తీసుకుందని అన్నారు. కేంద్రం అన్ని రిట్లకు సమాధానం ఇవ్వాలని కోరామని చెప్పారు. కొన్నింటికి మాత్రమే సమాధానాలు ఇచ్చారని అన్నారు. కేంద్రం తరపు న్యాయవాదులు అన్నిటికీ సమాధానం వేయాలంటే వేస్తామన్నారని ఆయన పేర్కొన్నారు.