తిరుపతి ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు.. ఇలా జరిగిందేంటి!

తిరుపతి ఎన్నికల చుట్టూ రాజుకున్న రాజకీయాలు ఫైనల్ స్టేజ్ కు వచ్చాయి. అధికార పార్టీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించిందని బీజేపీ, టీడీపీ అభ్యర్థులు రత్నప్రభ, పనబాక లక్ష్మిలు కలిసి హై కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఫలితాలను ఆపేయాలని, రీ ఓటింగ్ జరపాలని కోరారు. ఇన్ని రోజులుగా కోర్టు ఏం చెబుతుందా అని ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది.

ఇవాళ సుదీర్ఘంగా విచారణ జరిపిన కోర్టు కీలక తీర్పునిచ్చింది. బీజేపీ, టీడీపీ అభ్యర్థులు వేసిన పిటిషన్లను కొట్టేసింది. ఎలక్షన్‌ కమిషన్‌లో పిటిషన్‌ వేసుకోవాలని చెప్పింది. ఎలక్షన్‌ పిటిషన్‌కు అవకాశం ఉన్న ఈ సమయంలో దీనిపై నిర్ణయం తీసుకోలేమని తేల్చి చెప్పింది. ఎన్నికల ఫలితాలను తాము ఆపలేమంటూ ఇన్ డైరెక్ట్ గా చెప్పింది.

దీంతో టీడీపీ, బీజేపీ శ్రేణుల్లో నిరాశ నెలకొంది. ఇక ఈ రోజే తిరుపతిఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి. ఇందులో వైసీపీకే పట్టం కట్టనున్నట్టు స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. అటు ఎగ్జిట్ పోల్స్, ఇటు కోర్టు తీర్పుతో ప్రతిపక్షాలు డీలా పడ్డాయి. మరి రత్నప్రభ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి. ఎలక్షన్ కమిషన్ లో పిటిషన్ వేస్తారా లేదా అనేది చూడాలి.