మండలికి వెళ్ళిన చంద్రబాబు, దూసుకు వెళ్ళిన కొడాలి నానీ…!

103

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ, సిఆర్దియే రద్దు బిల్లులు రెండూ ఆసక్తికరంగా మారాయి. ఎలా అయినా సరే ఈ రెండు బిల్లులను మండలిలో ఆమోదం దిశగా తీసుకుని వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. మంగళవారం మండలిలో రెండు బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టగా తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన రూల్ 71 పై ముందు చర్చ జరిగింది. ఈ చర్చ అనంతరం జరిగిన ఓటింగ్ లో టీడీపీ విజయం సాధించింది.

ఇదిలా ఉంటే బుధవారం సాయంత్రం మండలిలో కీలక పరిణామ౦ చోటు చేసుకుంది. మండలిలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మండలి గ్యాలరీ లోకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు సహా టిడిపి నేతలు వచ్చారు. దీనితో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బిల్లుని సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేయాల్సిందేనని తెలుగుదేశం పట్టుబడుతుంది. ఇది కుదరదని అధికారపక్షం పట్టుబడుతుంది.

ఈ సందర్భంగా టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా మంత్రి బొత్స, లోకేష్ మధ్య పోడియం ముందే వాగ్వాదం జరిగింది. టిడిపి సభ్యులు వైపు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించిన మంత్రి కొడాలి నానిని మంత్రులు మోపిదేవి, రంఘనాథ రాజు, తెలుగుదేశం ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని వైపు దూసుకు వెళ్లేందుకు తెలుగుదేశం ఎమ్మెల్సీలు ప్రయత్నించారు.

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అధికారపక్షం మండిపడింది. సెలెక్ట్ కమిటీ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తెలుగుదేశం నేతలు స్పష్టం చేస్తున్నారు. సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేయాల్సి౦దే అంటూ పట్టుబట్టారు. ఒకరి వైపు ఒకరు ఇరు పక్షాల సభ్యులు దూసుకు వచ్చారు. సెలెక్ట్ కమిటీ విషయంలో ముందుగానే నోటీసులు ఇచ్చారని చైర్మన్ అన్నారు. దీనితో సభను 15 నిమిషాల పాటు వాయిదా వేసారు.