ఉత్తరాంధ్ర వైసీపీలో భారీ ట్విస్ట్..సీట్లు డౌటే.!

-

ఏపీ రాజకీయాలు చంద్రబాబు అరెస్ట్ చుట్టూనే తిరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రధానంగా అదే అంశంపై చర్చ ఉన్నా సరే..అధికార వైసీపీ మాత్రం ఇంకా తమకు తిరుగులేదనే అనుకుంటుంది. కానీ ఇది పైకి మాత్రం లోపల మాత్రం కొన్ని భయాలు ఉన్నాయి. బాబు అరెస్ట్ వల్ల సానుభూతి టి‌డి‌పికి ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది వైసీపీకి నష్టం చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

అదే సమయంలో పార్టీలో అంతర్గత తగాదాలు ఇబ్బందిగా మారాయి. అలాగే సీట్ల విషయంలో రచ్చ ఉంది. ఇటీవలే జగన్ కొందరు సిట్టింగులని మార్చాల్సిన పరిస్తితి ఉందని చెప్పుకొచ్చారు. దీంతో ఎవరికి సీటు దక్కకుండా ఉంటుందనే టెన్షన్ నెలకొంది. ఇదే క్రమంలో ఉత్తరాంధ్ర వైసీపీలో భారీ ట్విస్ట్‌లు నెలకొనే అవకాశాలు ఉన్నాయి. అక్కడ సీట్లలో భారీగా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఊహించని విధంగా బడా నేతల సీట్లకు ఎసరు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

 

మొదట శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం స్థానంలో కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపాలని జగన్‌ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. పాతపట్నం నుంచి ఎమ్మెల్యే రెడ్డి శాంతికి మళ్ళీ సీటు ఇవ్వడం డౌటే. ఎచ్చెర్లలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ గ్రాఫ్‌ ఏమాత్రమూ బాగోలేదని సర్వేలో తేలింది. రాజాంలో కంభాల జోగులుకు క్లారిటీ లేదు.   బొబ్బిలిలో ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడిని మార్చాలని చూస్తున్నారు.

యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజుకు డౌటే. శృంగవరపు కోట శాసనసభ్యుడు కడుబంది శ్రీనివాస్‌ని మార్చి కొత్తవారికి చాన్సు ఇవ్వాలని జగన్‌ యోచిస్తున్నట్లు తెలిసింది. పెందుర్తిలో ఎమ్మెల్యే అదీప్ రాజుకి యాంటీ ఉంది. నర్సీపట్నం, పాయకరావు, గాజువాక సీట్లలో కూడా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.మొత్తం మీద ఉత్తరాంధ్రలో పలువురు సిట్టింగులకు షాక్ తగలడం ఖాయం.

Read more RELATED
Recommended to you

Latest news