ఈటల వైపే జనం…రేవంత్‌కు సీన్ అర్ధమైంది…!

హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎలాంటి ఫలితం వస్తుందా? అని తెలంగాణ ప్రజలు తీవ్ర ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. హుజూరాబాద్ ప్రజలు ఎవరిని గెలిపిస్తారా? అనే ఆతృత అందరిలోనూ ఎక్కువైపోయింది. ఇప్పటికే ప్రచారం చివరి దశకు వచ్చేసింది..దీంతో ప్రధాన పార్టీలు దూకుడుగా ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. ఓ వైపు టీఆర్ఎస్ తన అధికార బలాన్ని మొత్తం ప్రయోగిస్తుంది…మంత్రి హరీష్ రావుతో పాటు….ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హుజూరాబాద్‌లో మోహరించి ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

etela
etela

ఇటు ఈటల రాజేందర్‌కు మద్ధతుగా రాష్ట్ర బీజేపీ నేతలు బరిలో దిగేసి ప్రచారం హోరెత్తిస్తున్నారు. అటు కాంగ్రెస్ అభ్యర్ధి వెంకట్ కోసం కాంగ్రెస్ శ్రేణులు ప్రచారంలో ఉన్నాయి. రేవంత్ కూడా దూకుడుగానే ప్రచారం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పోటీలో ఉన్నా సరే ఇక్కడ ప్రధాన పోటీ ఈటల-టీఆర్ఎస్‌ల మధ్యే జరగనుందని అర్ధమైపోతుంది. ముఖ్యంగా ఇక్కడ కేసీఆర్ వర్సెస్ ఈటల అన్నట్లుగానే ఫైట్ నడుస్తోంది.

టీఆర్ఎస్ నేతలు ఎంతగా బీజేపీని తిట్టిన పెద్దగా ప్రయోజనం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడి ప్రజలు పూర్తిగా కేసీఆర్-ఈటల మధ్య ఫైట్‌గానే చూస్తున్నారు. ఆ విషయం టి‌పి‌సి‌సి రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకునే పరిస్తితి. అందుకే ఆయన హుజూరాబాద్ ఉపఎన్నికని కాస్త లైట్ తీసుకున్నారు. కానీ కొంతమేర ఓట్లు తెచ్చుకోవాలని చూస్తున్నారు. అదే సమయంలో ఇక్కడ ప్రజలు ఈటల వైపు ఉన్నారనే క్లారిటీ కూడా రేవంత్‌కు వచ్చినట్లు కనిపిస్తోంది. ఆ విషయం ఆయన పరోక్షంగా ఒప్పుకునే పరిస్తితి. ఎందుకంటే హుజూరాబాద్‌లో తిరుగుతున్నప్పుడు ప్రజలు కాంగ్రెస్‌ని వ్యతిరేకించడం లేదు…అదే సమయంలో కాంగ్రెస్‌కు ఓటు వేయడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది.

కేసీఆర్ వర్సెస్ ఈటల అన్నట్లుగా జరిగే ఈ ఫైట్‌లో మెజారిటీ ప్రజలు ఈటల వైపే మొగ్గుచూపుతున్నారని రేవంత్‌కే అర్ధమయ్యే పరిస్తితి ఉంది. అందుకే రేవంత్ సైతం టీఆర్ఎస్ ఓటమి గురించి మాట్లాడుతున్నారు…కానీ కాంగ్రెస్ గెలుపు గురించి మాట్లాడటంలేదు. కాబట్టి హుజూరాబాద్‌ ఈటల వశం కానుందని అర్ధమవుతుంది.