హుజురాబాద్ విషయమై రేవంత్‌కు మేలు చేసిన కేసీఆర్.. ఎలాగంటే?

-

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ బై పోల్ అనివార్యమైన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే అక్కడ మళ్లీ గులాబీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ‘దళిత బంధు’ స్కీమ్‌ను పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్‌లో లాంచ్ చేశారు. విద్యార్థి నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను టీఆర్ఎస్ హుజురాబాద్ అభ్యర్థిగా ప్రకటించి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ సైతం ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. కాగా, కాంగ్రెస పార్టీ తరఫున బరిలో నిలబడబోయే అభ్యర్థి ఎవరో ఇంకా ప్రకటించలేదు టీపీసీసీ. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా గతంలో పోటీ చేసిన పాడి కౌశిక్‌రెడ్డి
టీఆర్ఎస్ పార్టీలో చేరి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సొంతం చేసుకున్నాడు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఎవరిని నిలపాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తోంది. ఈ త‌రుణంలోనే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని క‌లిశారు. ఆయ‌న అలా ప్రధానిని క‌లిసిన త‌ర్వాత ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఈ ఉప ఎన్నిక‌ను ఇప్ప‌ట్లో నిర్వ‌హించే అవ‌కాశం లేన‌ట్లు పేర్కొంది. అలా కేసీఆర్ చేసిన పని రేవంత్‌కు మేలు చేసిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. హుజురాబాద్ ఉప ఎన్నికకు ఎలాగూ కొంత టైం పడుతుంది. కాబట్టి ఈ టైంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరిని బరిలో దింపేందుకు ఒప్పించొచ్చని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే చాన్సెస్ ఉంటాయని రేవంత్ అనుకుంటున్నట్లు సమాచారం. ఇకపోతే హుజురాబాద్ ఉప ఎన్నికకు ఎలాగూ కొంత టైం పడుతున్నదన్న క్లారిటీ రావడంతో హుజురాబాద్‌లో పొలిటికల్ అట్మాస్పియర్ కొంత కూల్ అయింది. ప్రచార పర్వం కొనసాగుతున్నప్పటికీ టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులకు ప్రచారానికి కొంత బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news