షాకింగ్: తక్కువ ఓట్లుంటే “దళితబంధు” డబ్బులు వాపస్!

-

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో పుట్టిన దళితబంధు పథకం అసలు ఉద్దేశ్యం “రాజకీయ లబ్ధే” అని కామెంట్లు వస్తున్న నేపథ్యంలో… ఆ కామెంట్ నిజమనే సంఘటనలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కేవలం దళితుల ఓట్లను కేసీఆర్ వేసిన ఎరే “దళితబంధు” అనే కథనాలకు, కామెంట్లకు బలం చేకూరుతుంది! అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి… ఒంటరి మహిళలు, వృద్ధుల అకౌంట్లలోని అమౌంట్ డెబిట్ అవుతున్నట్లు సెల్ఫోన్ల కు వస్తున్న మెసేజ్లు!

Huzurabad | హుజురాబాద్
Huzurabad | హుజురాబాద్

అవును… హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు స్కీమ్ కింద ఇటీవల కొందరి అకౌంట్లలో పడ్డ రూ.9.90 లక్షలను ప్రభుత్వం వాపస్ తీసుకుంటోంది. ఒంటరి మహిళలు, వృద్ధుల అకౌంట్లలోని అమౌంట్ డెబిట్అవుతున్నట్లు సెల్ఫోన్లకు మెసేజ్లు వస్తున్నాయి. ఒక్క కమలాపూర్ మండలంలోనే 156 మంది అకౌంట్లు ఖాళీ అయ్యాయి. ఏం జరుగుతోందో తెలియక బాధితులంతా బ్యాంకులు, ఆఫీసర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. తీరా అక్కడికి వెళ్లాక బ్యాంకర్లు, ఆఫీసర్లు ఏం చెప్పకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు.

“దళితబంధు” 10లక్షల్లో భాగంగా… దళిత బంధు రక్షణ నిధికి రూ.10 వేలు పోను మిగతా రూ.9.90 లక్షలను లబ్ధిదారుల పేరున తీసిన ప్రత్యేక అకౌంట్ లో వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే… నియోజకవర్గంలోని వృద్ధులు, ఒంటరి మహిళలతో పాటు తక్కువ ఓట్లున్న ఇండ్లను టార్గెట్ చేసుకొని డబ్బులు వాపస్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదేక్రమంలో… తెరాసకు సహకరించడంలేదనే ఆలోచనతో చాలామంది యువకుల అకౌంట్ల నుంచి కూడా డబ్బులు కట్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

దీంతో… కేసీఆర్ “దళితబంధు” లక్ష్యం ఇదేనంటూ సోషల్ మీడియాలో కామెంట్లు మొదలైపోయాయి. కేవలం అధిక జనాభా ఉన్న దళితకుటుంబాలు – తెరాసకు మద్ధతుగా ఉన్న దళిత కుటుంబాలకే ఈ పథకం వర్తించేలా ఉందనే విమర్శలు కూడా పెరిగిపోతున్నాయి. మరి ఈ విషయంపై కేసీఆర్ సర్కార్ ఎలా స్పందిస్తుందనే వేచి చూడాలి! ఈ పథకంపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్న పెద్దలు ఈ సంఘటనపై ఎలా స్పందిస్తారనేది చూడాలి!

Read more RELATED
Recommended to you

Latest news