సభలో మొబైల్ వాడిన లోకేష్, మంత్రి షాకింగ్ రిప్లయ్…!

-

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సియార్దియే రద్దు సహా అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులపై చర్చ జరుగుతుంది. ఈ బిల్లులపై తెలుగుదేశం నేతలు అందరూ దాదాపుగా ప్రసంగిస్తున్నారు. రూల్స్ 71 లో జరిగిన ఓటింగ్లో ప్రభుత్వం ఓడిపోవడంతో నేడు ఏం జరుగుతుందనేది శాసనమండలిలో ఆసక్తికరంగా మారింది. ఇక మంత్రులు కూడా ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఎలాగైనా సరే బిల్లు నెగ్గాలని మంత్రులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంత్రులందరూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ తరుణంలో తెలుగుదేశం కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళుతుంది. ఇదిలా ఉంటే తెలుగుదేశం ఎమ్మెల్సీ మాజీ మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో కీలక ప్రసంగం చేశారు.

గతంలో ఐఏఎస్ ఆఫీసర్ మన్మోహన్ సింగ్ జారీ చేసిన ఒక సర్క్యులేషన్ సభలో చదివి వినిపించారు. దీనిలో భాగంగా లోకేష్ తన మొబైల్ ఫోన్ వినియోగించారు. లోకేష్ మొబైల్ తీసి చదువుతుండగా జోక్యం చేసుకున్న మంత్రి అది సభా సంప్రదాయం కాదని.. తనకున్న పరిజ్ఞానం మేరకు సభలోకి మొబైల్ తీసుకురావడం కానీ, మాట్లాడటం కానీ నిషేధం అన్నారు.

దీనిపై ఆయన అసహనం వ్యక్తం చేసారు. అదేవిధంగా దీనిపై ఒక సారి నిబంధనలు గమనించాలని మండలి డిప్యూటీ చైర్మన్ మంత్రి కోరారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న మరో ఎమ్మెల్సీ సభలో వైఫై సౌకర్యం ఉందని మొబైల్ చోట్ల తప్పు లేదని వ్యాఖ్యానించారు. వాటిలో నోట్స్ ఉంటుందని దాన్ని చూసి చదవడంలో తప్పు లేదని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news