ఇక యుద్ధమే.. పాకిస్తాన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన భారత్..!

ఇటీవలే జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ రెచ్చిపోయి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరపడంతో ఏకంగా నలుగురు భారత జవాన్లు వీర మరణం పొందారు. అంతేకాకుండా అక్కడి స్థానిక పౌరులు కూడా మరణించారు ఇంకెంతో మంది స్థానిక పౌరులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇక పాకిస్థాన్ దుశ్చర్య పై ప్రస్తుతం భారత్ రగిలిపోతోంది.

ఇక పాకిస్థాన్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడ్డ పాకిస్థాన్ పై స్పందించిన భారత్ సీరియస్ అయింది అంతే కాకుండా పాకిస్తాన్ కి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ దౌత్య అధికారికి సమన్లు జారీ చేసింది భారత్. మరోసారి సరిహద్దుల్లో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఆ సమాధానం వేరేలా ఉంటుంది అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇక మరో సారి పాకిస్తాన్ తోక జాడిస్తే భారత్ యుద్ధం చేస్తుందని అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.