కమలంతో కారు దోస్తీ…అమిత్ షా రెడీ?

-

కమలం పార్టీతో కారు పార్టీ దోస్తీ చేస్తుందా? ఢిల్లీ వేదికగా బి‌జే‌పి-టి‌ఆర్‌ఎస్ పార్టీల పొత్తు మొదలైందా? అంటే అవుననే తెలంగాణ రాజకీయ వర్గాల నుంచి సమాధానం వస్తుంది. ఇప్పటికే తెలంగాణలో టి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య నువ్వా-నేనా అన్నట్లు వార్ జరుగుతుంది. ఇదే సమయంలో కే‌సి‌ఆర్ ఢిల్లీకి వెళ్ళి పదిరోజుల వరకు మకాం వేసి, ప్రధాని, కేంద్ర మంత్రులని వరుస పెట్టి కలిశారు. దీంతో టి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య స్నేహబంధం బయటపడిందని కాంగ్రెస్ విమర్శలు మొదలుపెట్టింది.

amit-shah

కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో టి‌ఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. రెండు పార్టీల మధ్య అవగాహన ఉంది కాబట్టే స్థలం కూడా కేటాయించారని కాంగ్రెస్ అంటుంది. అయితే ఇది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య జరిగే సమావేశమే అని అటు బి‌జే‌పి, ఇటు టి‌ఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. సి‌ఎంలు, ప్రధాని మంత్రిని, కేంద్ర మంత్రులని కలవడం సహజమే అని అంటున్నారు.

ఇదే సమయంలో బి‌జే‌పి పైకి అలా చెబుతున్నా సరే లోపల మాత్రం కాస్త కంగారు పడుతున్నట్లే కనిపిస్తోంది. కే‌సి‌ఆర్ వ్యూహాత్మకంగా టి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిలు ఒకటే అని చూపించే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర బి‌జే‌పి నేతలు భయపడుతున్నారు. ఈ విషయాన్ని టి‌ఆర్‌ఎస్ నేతలు పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదు. బి‌జే‌పితో పొత్తు ఉన్న ఉందని మాట్లాడుకున్న ఏం కాదులే అన్నట్లుగా ఉన్నారు.

కానీ బి‌జే‌పి నేతలు, టి‌ఆర్‌ఎస్‌తో స్నేహం లేదని రుజువు చేసేందుకే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 17న నిర్మల్ రానున్న అమిత్ షా చేత, కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ఢిల్లీలో ఎలా ఉన్నా, రాష్ట్ర స్థాయిలో మాత్రం కే‌సి‌ఆర్ తమకు శత్రువే అని అమిత్ షా నిరూపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చూడాలి మరి కారు-కమలం రాజకీయం ఎలా ఉంటుందో?

Read more RELATED
Recommended to you

Latest news