మళ్ళీ టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై బీఆర్ఎస్ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చిన బాబు..ఖమ్మం వేదికగా భారీ సభ పెట్టి..ఇతర పార్టీల్లోకి వెళ్ళిన మాజీ తమ్ముళ్లని మళ్ళీ టీడీపీలోకి తిరిగిరావాలని పిలుపునిచ్చారు. ఇక ఎవరిపైన విమర్శలు చేయలేదు. కానీ బాబు సభపై వెంటనే బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. ఏపీలో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా అని విమర్శలు చేశారు. అయితే తెలంగాణలో బలం ఉందని చూపించ్కుని, ఇక్కడ బీజేపీకి మద్ధతు ఇచ్చి, ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని బాబు ప్లాన్ చేశారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేశారు..
కానీ వీటిపై బీజేపీ నేతలు స్పందించలేదు. అసలు బాబు ఖమ్మం సభ గురించి ఎవరు మాట్లాడలేదు. అయితే చంద్రబాబు ఎప్పటినుంచో బీజేపీ సపోర్ట్ కొసం చూస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సపోర్ట్ ఇస్తే..అధికార బలం తోడై ఏపీలో కలిసొస్తుందని భావిస్తున్నారు. అయితే బీజేపీ ఏమో చంద్రబాబుతో మళ్ళీ కలిసే ప్రసక్తి లేదని చెబుతున్నారు. ఇక ఇలాంటి తరుణంలో బాబు తెలంగాణలో ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణలో ప్రస్తుతం టీడీపీకి బలం లేదు. ఒక్క సీటు కూడా గెలుచుకునే శక్తి లేదు. కానీ ఇక్కడ టీడీపీ బలం పెంచాలని బాబు చూస్తున్నారు.
అయితే ఖమ్మం సభతో తెలంగాణలో ఇంకా టీడీపీని అభిమానించే వారు ఉన్నారని అర్ధమవుతుంది. ఇదే అడ్వాంటేజ్ గా తీసుకుని ఖమ్మం, హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో కాస్త పార్టీ బలం పెంచుకుంటే..కొన్ని సీట్లలో గెలుపోటములని డిసైడ్ చేసే శక్తిగా ఉండవచ్చని చూస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈ సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో 5-10 వేల ఓట్లు ఉన్నా చాలు..టీడీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ బలం వస్తే బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి ముందుకొస్తుందని బాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ భయం కూడా అదే. కానీ బీజేపీ..టీడీపీతో కలుస్తుందా? అనేది పెద్ద ప్రశ్న. ప్రస్తుతానికి బీజేపీకి ఆ ఆలోచన లేనట్లే ఉంది. మరి ఎన్నికల సమయంలో ఏం జరుగుతుందో చూడాలి.