తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టలో ఆధిపత్య పోరు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా స్థానాల్లో బిఆర్‌ఎస్ నేతల మధ్య పోరు నడుస్తోంది. కానీ అధిష్టానం..ఎక్కడకక్కడ పోరుకు చెక్ పెట్టుకుంటూ రావాలని చూస్తుంది. అయితే అనుకున్న మేర నేతల పోరు మాత్రం ఆగలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్‌ఎస్ లోకి వచ్చిన 12 మంది ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో నేతల మధ్య రచ్చ నడుస్తోంది.
అలా పోరు నడుస్తున్న స్థానాల్లో భూపాలపల్లి కూడా ఒకటి. ఈ స్థానంలో రాజకీయ పరిస్తితులు కాస్త భిన్నంగా ఉంటాయి. 2014 ఎన్నికల్లో ఇక్కడ బిఆర్‌ఎస్ నుంచి మధుసూదనచారి గెలిచారు. అలాగే తెలంగాణ తొలి స్పీకర్ గా పనిచేశారు. ఇక 2018 ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి కాంగ్రెస్ నేత గండ్ర రమణారెడ్డి గెలిచారు. గెలిచిన కొన్ని రోజులకే ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలి బిఆర్‌ఎస్ లోకి వెళ్లారు. దీంతో భూపాలపల్లిలో పాత బిఆర్‌ఎస్ శ్రేణులతో గండ్రకు పడని పరిస్తితి. ఇటు మధుసూదనచారి..గండ్రతో కలవని పరిస్తితి.
దీంతో అక్కడ రెండు వర్గాల మధ్య పోరు నడుస్తోంది. పైగా తాజాగా కేటిఆర్ భూపాలపల్లికి వచ్చారు. అక్కడ సభ జరగగా, సభలోనే మధుసూదన వర్గం..పెద్ద ఎత్తున సీటు విషయంపై నినాదాలు చేసింది. దీంతో కేటిఆర్..మధుసూదన మండలికి..గండ్ర అసెంబ్లీ కంటూ కేటిఆర్ చెప్పుకొచ్చారు. ఎలాగో మధుసూదనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయనకు నెక్స్ట్ సీటు లేదని తేల్చేశారు.
అంటే భూపాలపల్లి సీటు గండ్రకే ఫిక్స్. అయితే మధుసూదన వర్గం..గండ్రకు సీటు ఇస్తే ఓడిస్తామనే పట్టుదలతో ఉన్నాయి. ఒకవేళ గండ్రకు సీటు ఇస్తే మధుసూదన వర్గం సపోర్ట్ చేసే అవకాశాలు లేవు. దీంతో బిఆర్‌ఎస్ లోనే ఓట్లు అటు ఇటు అయ్యేలా ఉన్నాయి. అదే జరిగితే భూపాలపల్లిలో మళ్ళీ బిఆర్‌ఎస్ పార్టీకి షాక్ తగిలేలా ఉంది.