హర్షకుమార్ వారసుడుకు బాబు లైన్ క్లియర్?

-

ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటాడానికి ఇప్పటినుంచే అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే వన్ బై వన్ నేతలతో మాట్లాడుతూ అసెంబ్లీ స్థానాల పరిధిలో పార్టీ బలం పెంచేలా దిశానిర్దేశం చేస్తున్నారు. అదే సమయంలో ఊహించని విధంగా ఈ సారి అభ్యర్ధులని మారుస్తూ వస్తున్నారు.

యువనేతలకు పెద్ద పీఠ వేస్తున్నారు..యువత ఓట్లని టార్గెట్ చేసుకుని ఆల్రెడీ లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. అలాగే అసెంబ్లీ టికెట్లని యువ నేతలకు కేటాయించేలా ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో కొందరు సీనియర్లని సైడ్ చేస్తున్నారు. తాజాగా నాలుగు స్థానాల్లో ఇంచార్జ్‌లని పెట్టారు..నలుగురుని యువ నేతలకే ఛాన్స్ ఇచ్చారు.  నెల్లిమర్లలో సీనియర్ నేత పతివాడ నారాయణస్వామిని పక్కన పెట్టి బంగార్రాజుకు ఛాన్స్ ఇచ్చారు. ఇటు తుని సీటు యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు ఫిక్స్ చేశారు. అటు పి.గన్నవరం సీటు బాలయోగి తనయుడు హరీష్‌కు కేటాయించారు. సత్యవేడు సీటుని మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె హెలెన్‌కు బాధ్యతలు అప్పగించారు.

May be an image of 1 person, standing and text that says "జైచంద్రబాబు తెలుగుదేశం"

ఇలా యువ నేతలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత హర్షకుమార్ తనయుడు శ్రీరాజ్ సైతం టి‌డి‌పిలో చేరడానికి సిద్ధమయ్యారని తెలిసింది. ఇప్పటికే శ్రీరాజ్..చంద్రబాబుని కలిశారు. ఇదే క్రమంలో అమలాపురంలో ఉన్న హరీష్‌ని..పి. గన్నవరంకు పంపారు. దీంతో అమలాపురం పార్లమెంట్ లో హర్షకుమార్ తనయుడుకు రూట్ క్లియర్ అయింది.

గతంలో హర్షకుమార్ రెండు సార్లు కాంగ్రెస్ నుంచి అమలాపురం ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల ముందు టి‌డి‌పిలోకి వచ్చారు. అమలాపురం సీటు కోసం ట్రై చేశారు కానీ దక్కలేదు. దీంతో ఆయన మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఇప్పుడు ఆయన తనయుడు టి‌డి‌పిలోకి వస్తారని తెలుస్తోంది. అందుకే అమలాపురం ఎంపీ సీటుని ఖాళీ చేసినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news