ఏదైనా వేరే దేశం  వెళ్తే జగన్ ని అరస్ట్ చేస్తారా ? 

వైయస్ జగన్ ఢిల్లీ టూర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వైసీపీ పార్టీ నేతలు మాత్రం కేంద్రం ఆంధ్ర రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తుందని జగన్ ఢిల్లీ టూర్ సక్సెస్ అయిందని మీడియా ముందు తెగ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్ ఏపీ అభివృద్ధి కోసం కాదని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. విషయంలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ వెనుక అసలు రహస్యం ఏదైనా దేశం వెళితే జగన్ ని అరెస్టు చేసే వార్తలు రావడమే అంటూ టిడిపి నాయకుడు బోండా ఉమ తెలిపారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఒక కేసు వాన్ పిక్ కేసు కూడా ఒకటి. ఈ కేసులో జగన్ తో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ పేరు కూడా ఉంది. ఇటువంటి తరుణంలో నిమ్మగడ్డ ప్రసాద్ కొద్ది నెలల క్రితం ఆయన విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు ఆయనను అరెస్టు చేసి అక్కడే జైల్లో ఉంచారు. Image result for jagan kurnool

ఆ తర్వాత ఆయన కండిషనల్ బెయిల్ మీద బయటకు వచ్చినప్పటి కీ భారతదేశానికి రాలేకపోయారు. ఈ సందర్భంగా జగన్ ఢిల్లీ టూర్ గురించి బొండా ఉమా మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ని సెర్బియా దేశానికి ఫారిన్ ట్రిప్ వెళ్ళినప్పుడు అరెస్ట్ చేసిన నేపథ్యంలో  దేశంలో ఏ-1 నిందితుడిగా ఉన్న జగన్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉండటంతోనే జగన్ ఢిల్లీలో మోడీ మరియు అమిత్ షా కాలు పట్టుకోవడానికి వెళ్లారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

 

దీంతో బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని…ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయి చాలా కీలకమైన టైములో మోడీ ఢిల్లీకి జగన్ ని పిలిపించుకొని మాట్లాడటం జరిగిందన్నారు. అసలు ఏదైనా వేరే దేశం వెళితే జగన్ నీ అరెస్టు చేస్తారు అని టిడిపి నేతలు చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. వేరే దేశానికి వెళ్లే చాన్స్ జగన్ కి లేకపోతే పాస్ పోర్ట్ ఎందుకు వస్తాయి అంటూ వైసీపీ నేతలు బోండా ఉమా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు వేస్తున్నారు.