టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్ గా మార్చి కేసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కేంద్రంలో బీజేపీని గద్దె దించాలనే లక్ష్యంగా కేసిఆర్ పనిచేస్తున్నారు. అలాగే బిఆర్ఎస్ పార్టీని అన్నీ రాష్ట్రాల్లో బలోపేతం చేసే దిశగా ముందుకెళుతున్నారు. ఇప్పటికే ఆయన ఏపీ, కర్నాటక, మహారాష్ట్రలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో నేతలని బిఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకుంటున్నారు.
ఇటీవల కాలంలో ఆయన మహారాష్ట్రపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. అక్కడ భారీ మీటింగ్ కూడా పెట్టారు. పెద్ద ఎత్తున బిఆర్ఎస్ లోకి నేతలని తీసుకుంటున్నారు. అలాగే రానున్న స్థానిక ఎన్నికల్లో మహారాష్ట్రలో సత్తా చాటాలని చెప్పి చూస్తున్నారు. ఎలాగో తెలంగాణకు ఆనుకుని ఉన్న మహారాష్ట్ర జిల్లాల్లో బిఆర్ఎస్ పార్టీకి పట్టు ఉందని కేసిఆర్ నమ్ముతున్నారు. ఆయా జిల్లాల్లో జెడ్పీ పీఠాన్ని సొంతం చేసుకోవాలని కేసిఆర్ చూస్తున్నారు. అలాగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని చెప్పి పనిచేస్తున్నారు.
అటు కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నారు. ఇలా కేంద్ర రాజకీయాలపై ఫోకస్ చేసిన కేసిఆర్..సొంత రాష్ట్రంలో దెబ్బతింటారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలని కేసిఆర్ చూస్తున్నారు. అయితే ఇక్కడ సులువుగా గెలిచేస్తామనే ధీమా కేసిఆర్ కు ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే ఇతర రాష్ట్రాలపై ఫోకస్ చేస్తున్నారు.
కానీ ఈ సారి తెలంగాణలో సులువుగా గెలవడం కష్టం..బిఆర్ఎస్ పార్టీ గెలవడం కోసం కష్టపడాల్సి ఉంది. అటు కాంగ్రెస్, బిజేపిలు గట్టి పోటీ ఇస్తున్నాయి. అయితే కేటిఆర్ పైనే భారం వేసి కేసిఆర్ జాతీయ రాజకీయాల్లో తిరుగుతున్నట్లు కనిపిస్తున్నారు. 2019 ఎన్నికల ముందు ఇలాగే చంద్రబాబు సైతం జాతీయ రాజకీయాల్లో హల్చల్ చేసి..ఏపీలో దెబ్బతిన్నారు. మరి అలా కేసిఆర్ అవుతారా? లేదా తెలంగాణలో మళ్ళీ గెలిచి..జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారేమో చూడాలి.