బీజేపీకి సోయం గుడ్‌బై..కిషన్ రెడ్డి తేల్చేసారా?

-

తెలంగాణ బి‌జే‌పికి షాక్ తగలనుందా? ఎంపీ సోయం బాపూరావు బి‌జే‌పిని వీడటానికి సిద్ధమయ్యారా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని బట్టి చూస్తే అదే నిజమే అనిపిస్తుంది. ఇటీవల ఆయన ఎస్టీ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాష్ట్రంలో లంబాడీలను గిరిజన జాబితా నుండి తొలగించాలని లేదంటే మణిపూర్ మారణహోమం తరహా ఆందోళన చేస్తామని ఆయన మాట్లాడటం ఆదిలాబాద్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఎంపీ మాటలు వివాదాస్పదం అయ్యాయి. ఎంపీ మాటలని…బి‌జే‌పి మాటగా చేస్తూ విమర్శలు వస్తున్నాయి. దీంతో అధ్యక్షుడు కిషన్ రెడ్డి తాజాగా స్పందించారు. లంబాడీల విషయంలో ఎంపీ సోయం బాపూరావు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని, సోయం బాబురావు చేసిన వ్యాఖ్యలతో తాము ఏకీభవించబోమని స్పష్టం చేశారు.

తాజాగా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే సంజీవరావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి బీజేపీలో చేరారు. కిషన్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఈ సందర్బంగా ఎంపీ మాటలపై వివరణ ఇచ్చారు. సోయం బాపూరావు వ్యాఖ్యలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. సోయం బాపూరావు వ్యాఖ్యలపై పార్టీ వివరణ కోరుతోందన్నారు. అంటే ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే లంబాడీలకు రిజిస్ట్రేషన్ల‌పై బీజేపీ కట్టుబడి ఉందని, అధికారంలోకి రాగానే లంబాడీలకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటోందని, తొమ్మిదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో గిరిజనులకు అన్యాయం జరిగిందని,  జనాభా ప్రాతిపదికన గిరిజన రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఇక ఎంపీ సోయం బాపూరావు వ్యవహారం కూడా కాస్త తేడాగానే ఉంది. ఆయన బి‌జే‌పి నుంచి వదిలి వెళ్లడానికి ఈ తరహా కామెంట్స్ చేస్తున్నారనే ప్రచారం ఉంది. ఆయన త్వరలోనే బి‌జే‌పికి గుడ్ బై చెప్పేస్తున్నారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news