ఎంపీ రఘురామ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. ఆయన వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంతో అన్ని పార్టీల చూపు ఆయనపై పడింది. అయితే ఆయన వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రానికి ఫిర్యాదులు చేయడంతో జగన్ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇక దీని తర్వాత జగన్ డైరెక్టుగా రంగంలోకి దిగి ఢిల్లీ టూర్ వేసి కేంద్ర పెద్దలను కలిశారు. సైలెంట్‌గానే తన వ్యూహాన్ని అమలు చేస్తూ తన పని తాను చేసుకుంటూ పోయారు జగన్. కాగా ఎప్పుడైతే జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత అమరావతికి వచ్చారో అప్పటి నుంచి ప్లాన్ అమలు చేయడం మొదలు పెట్టారు ఏపీ సీఎం. ఇందులో భాగంగా ఎంపీ మార్గాని భరత్ తో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయించి షాక్ ఇచ్చారు.
ఆ తర్వాత ఏకంగా వైసీపీ అధికార వెబ్‌సైట్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రఘురామ పేరును తొలగించడం రాజకీయాల్లో ప్రకంపనలు రేపిందనే చెప్పాలి. దీంతో వరుసగా షాక్‌లు తగలడంతో ఎంపీ రఘురామ కాస్త ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. వీటిపై ఆయన మాట్లాడుతూ తన ఎంపీ పదవిపై కేంద్రం అనర్హత వేయడం అంత సులభం కాదంటూ వివరించారు. అంతే కాదు స్పీకర్ ను కలిసి తనపై వచ్చిన ఫిర్యాదులను తీసుకోవద్దంటూ కోరండ ఆయన పదవిపై భయపడుతున్నట్టు స్పష్టమవుతోంది.