ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓటు వేస్తారా… అంటే చెప్పడం కాస్త కష్టంగానే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి అవకాశాలు చాలా తక్కువ. భారతీయ జనతా పార్టీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయడం మానేసి ప్రతిపక్షాలపై పోరాటం చేయడం గత ప్రభుత్వాలను విమర్శించడం వంటివి చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీకి ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకు కూడా కాస్త దూరం అయింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జనసేన పార్టీతో భారతీయ జనతా పార్టీ కాస్త కలిసి వచ్చే అంశం అయినా సరే జనసేన పార్టీని… కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి మేము చెప్పింది రాష్ట్రంలో కూడా జరగాలి అనే అభిప్రాయాన్ని బిజెపి నేతలు వ్యక్తం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. అది పార్టీకి ప్రధాన సమస్యగా మారింది. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల విషయంలో జనసేన పార్టీకి భారతీయ జనతా పార్టీ విషయంలో ఒక మంచి అవకాశం వచ్చింది అనే విషయం అర్థమవుతుంది.
ఎందుకు అని చూస్తే తిరుపతి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే కనీసం డిపాజిట్ కూడా వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. అదే జనసేన పార్టీ పోటీ చేసి ఉంటే కాపు సామాజిక వర్గం దళిత సామాజిక వర్గాలు కూడా పార్టీ వైపు చూసి ఉండేవి. మధ్యతరగతి ప్రజలు కూడా ప్రతిపక్షం, అధికార పక్షానికి కాకుండా జనసేనకు ఓటు వేసే అవకాశం ఉండేది. కానీ భారతీయ జనతా పార్టీ విషయంలో ఈ సామాజిక వర్గాలు అన్ని దూరం గానే ఉన్నాయి. సామాన్య ప్రజలు కూడా ఆగ్రహం గానే ఉన్నారు. కాబట్టి బీజేపీకి డిపాజిట్ రావడం కూడా కష్టంగానే ఉంటుంది. కాబట్టి బీజేపీ పై ప్రజల్లో ఏ విధంగా అభిప్రాయం ఉందో జనసేన పార్టీకి కూడా ఈ ఎన్నిక ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది.