వైఎస్ షర్మిలతో పార్టీ పెట్టించింది ఎవరో తెలిసిపోయింది!!

-

వైఎస్ షర్మిల… ఆ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. జగన్మోహన్రెడ్డి కోసం ఆమె చేసిన పాదయాత్ర ఆంధ్ర, తెలంగాణలో షర్మిలకు ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు కొత్తగా రాజకీయపార్టీ స్థాపించనున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ వెనక టీఆర్ ఎస్ ఉందా? బీజేపీ ఉందా? ఇప్పటివరకు ఎవరికీ సమాధానం దొరకలేదు. తన పార్టీ వెనక ఎవరూ లేరంటూ షర్మిల టీఆర్ ఎస్పై, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ విమర్శలన్నీ మాటల వరకే పరిమితమా? అనే సందేహం వస్తోంది.
ఇప్పుడిప్పుడే ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతోంది.

కేసును వెనక్కి తీసుకుంటున్న కేసీఆర్ సర్కార్

2012లో పరకాల ఉప ఎన్నిక సందర్భంగా విజయమ్మ, షర్మిల చేసిన ప్రచార సమయంలో నిబంధనల్ని ఉల్లంఘించారంటూ కేసు నమోదైంది. దీనికి సంబంధించిన న్యాయ విచారణ ప్రస్తుతం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో సాగుతోంది. తాజాగా జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. 2012లో నమోదైన ఈ కేసును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన పిటిషన్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు.

వాదనలకు బలం చేకూరుతోంది

రాజకీయంగా హోరాహోరీగా తలపడే పరిస్థితుల్లో అన్ని రాజకీయపార్టీలున్నాయి. ప్రత్యర్థులపై ఏ చిన్న అవకాశం దొరికినా వదిలే పరిస్థితి లేదు. కానీ ఈ కేసును ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఏమిటన్నది ఇప్పుడు అంతుపట్టని ప్రశ్నగా మారింది. నిజంగానే షర్మిల కొత్త పార్టీ వెనుక కేసీఆర్ ఉన్నారా? రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చటం కోసం ఆయనే షర్మిలచేత పార్టీ ఏర్పాటు చేయిస్తున్నారా? అనే వాదనకు బలం చేకూరుతోంది. కోర్టుకు చెప్పినట్లుగా కేసు ఉపసంహరణ పిటిషన్ ను ప్రభుత్వం దాఖలు చేస్తే.. అది కేసీఆర్ సర్కారును ఇబ్బందిపెట్టే అవకాశంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈనెల 31వ తేదీన ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ జరగబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news