వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు వైసీపీ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఇది అధికార పార్టీ కుట్ర అని వైసీపీ పార్టీ నేతలు ఆరోపించాగా…తెలుగుదేశం పార్టీ నేతలు కావాలని సానుభూతి రాజకీయాల కోసం జగన్…తన బాబాయిని హత్య చేయించాడని అప్పట్లో ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఈ కేసుని సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని అప్పట్లో హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అయితే తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యాక….వివేక హత్య కేసు విషయంలో విచారణ నత్తనడకన సాగటంతో వివేక కూతురు సునీత రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఈ కేసులో తనకి చాలా అనుమానాలు ఉన్నాయని తన తండ్రి హత్య కేసు సిబిఐ చేత విచారణ చేయించాలని తాజాగా హైకోర్టు లో పిటిషన్ వేయడం జరిగింది.
ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష లీడర్ గా ఉన్న సమయంలో జగన్ వేసిన సిబిఐ విచారణ పిటిషన్ నీ మూసివేయాలని సీఎం జగన్ కోరారు. తన పిటిషన్‌లో తదుపరి ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఎందుకు పిటిషన్‌ను మూసివేయాలని కోరుతున్నారో లిఖితపూర్వకంగా కారణాలు తెలియజేయాలని జగన్‌ను ఆదేశించింది. ఇందుకు సంబంధించి తదుపరి విచారణ నాటికి మెమోలు దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. వచ్చే విచారణ 13వ తారీఖున అయిన నేపథ్యంలో ఈ కేసులో జగన్ భవిష్యత్తు తేలిపోతుందని కథలో అసలైన ట్విస్ట్ బయటపడే అవకాశం ఉందని కామెంట్ చేస్తున్నారు టిడిపి నేతలు.