వెయ్యి రూపాయల విషయం లో జగన్ భారీ మెలిక పెట్టాడు గా !

-

కరోనా వైరస్ వల్ల కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చాలా పటిష్టంగా అమలు పరుస్తున్నాయి. ఎవరు కూడా బయటకు రాకుండా ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యేటట్లు రెండు ప్రభుత్వాల యంత్రాంగాలు గట్టిగా పని చేస్తున్నాయి. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి విషయంలో ప్రారంభంలో అంతా బాగానే ఉన్నా గాని ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారికి వైరస్ సోకటం తో ఒక్కసారిగా నెంబర్ మొత్తం పెరిగిపోయింది. ఢిల్లీ దెబ్బకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఊహించని రీతిలో పెరిగిపోయింది.Andhra Pradesh : corona financial aid only to rice cardholders ...దీంతో జగన్ ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయ్యి…ఎవరైతే ఢిల్లీ మాత ప్రార్థనలకు వెళ్లారో వారి వివరాలను కనుక్కొని ఆయా ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. ఇదిలా ఉండగా లాక్ డౌన్ అమలులో ఉండటంతో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు ఉపాధి కోల్పోవటంతో వాళ్లకి జగన్ సర్కార్ రేషన్ కల్పించడం జరిగింది. అయితే ఈ రేషన్ పాత కార్డు ఆధారంగా ఇవ్వటం జరిగింది. ఇదే తరుణంలో ఆర్థికంగా ఆదుకుంటామని జగన్ ప్రభుత్వం ఇటీవల ప్రకటన ఇచ్చిన సంగతి అందరికీ తెలిసినదే. ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయలు లాక్ డౌన్ సందర్భంగా ఉద్యోగాలకి వెళ్లలేని పరిస్థితి కావడంతో ఆదుకోవడం కోసం ప్రభుత్వం ఇస్తున్నది అంటూ జగన్ చెప్పుకొచ్చారు.

 

అయితే తాజాగా ఈ వెయ్యి రూపాయల విషయంలో జగన్ భారీ మెలిక పెట్టారు. అదేమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా కోటి 29 లక్షల కుటుంబాలకు రేషన్ పాత కార్డుల ద్వారా ఇవ్వగా…ఆర్థికంగా ₹1000 మాత్రం ఎవరికైతే కొత్త రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్లకే వర్తిస్తుందని ఏపీ సర్కార్ సరికొత్త ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో చాలా వరకు కొత్త రేషన్ కార్డు దారులు లేకపోవడంతో వాళ్లంతా…ఏపీ ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయాని తప్పు పడుతున్నారు. అంతేకాకుండా వెయ్యి రూపాయల ఆర్థిక సహాయాన్ని కొత్త రేషన్ కార్డుదారులకు గ్రామ వాలంటీర్ల ద్వారా ఇవ్వబోతున్నట్లు జగన్ సర్కార్ వెల్లడించింది. 

Read more RELATED
Recommended to you

Latest news