మరోసారి వైసీపీని జగన్ ఇమేజ్ అధికారంలోకి తీసుకొస్తుందా? అంటే నో డౌట్..గత ఎన్నికల్లో అదే జరిగింది..ఈ సారి కూడా అదే జరుగుతుందని అంటున్నారు. గత ఎన్నికల్లో కేవలం జగన్ బొమ్మ చూసే వైసీపీకి వన్ సైడ్ గా గెలిచేసింది. అసలు ప్రజలు ఏదో కొన్ని నియోజకవర్గాల్లో తప్ప..మిగిలిన చోట్ల పెద్దగా ఎమ్మెల్యే అభ్యర్ధి ఎవరనేది పట్టించుకోలేదు. కళ్ళు మూసుకుని జగన్ బొమ్మ చూసి ఓట్లు వేసేశారు.
అందుకే వైసీపీ ప్రతి జిల్లాలో వన్‌సైడ్‌గా గెలిచింది..151 సీట్లు సాధించింది. మరి ఈ సారి కూడా అలాగే ఫలితాలు వస్తాయా? అంటే కాస్త కష్టమని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సారి టిడిపి నుంచి గట్టి పోటీ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. అదే సమయంలో జనసేనతో పొత్తు ఉంటే వైసీపీకి ఇంకా ఇబ్బంది. కానీ పొత్తు ఉన్నా సరే ఏపీలో పేద, మధ్య తరగతి ప్రజలు జగన్ పైనే ఆశలు పెట్టుకున్నారు. మళ్ళీ జగన్ వస్తేనే సంక్షేమ పథకాలు అందుతాయని చూస్తున్నారు.
రాష్ట్రంలో పేద, మధ్య తరగతి వర్గాల వారే ఎక్కువ అనే సంగతి తెలిసిందే. ఇక వారే మళ్ళీ జగన్‌ని గెలిపించుకుంటారు. అయితే జగన్ ఇమేజ్ మళ్ళీ రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలపై ఎక్కువగానే ఉంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదని చెప్పవచ్చు. ఒక ఉమ్మడి అనంతపురంలో టిడిపితో హోరాహోరీ ఉండవచ్చు. ఓవరాల్ గా మాత్రం సీమలో మళ్ళీ వైసీపీకే లీడ్.
ఇటు వస్తే నెల్లూరు-ప్రకాశం జిల్లాల్లో కూడా జగన్ ప్రభావం ఎక్కువే. ఈ జిల్లాల్లో వైసీపీదే ఆధిక్యం. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో టిడిపితో కాస్త గట్టి పోటీ ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో టిడిపి-జనసేన కలిస్తే..ఆధిక్యం తెచ్చుకుంటాయి..లేదంటే వైసీపీ లీడ్ ఉంటుంది. ఉత్తరాంధ్రలో విశాఖ, శ్రీకాకుళంలో టిడిపి-వైసీపీల మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది. ఇక విజయనగరంలో మళ్ళీ వైసీపీదే లీడ్. ఓవరాల్ గా 7 జిల్లాల్లో వైసీపీకి ఆధిక్యం ఖాయం..మిగిలిన జిల్లాల్లో సగం సీట్లు గెలుచుకున్న చాలు..మళ్ళీ వైసీపీదే అధికారం.